దళపతి విజయ్‌కు ఊహించని అనుభవం.. ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా బాబు !

సినీ స్టార్లపై అభిమానుల ప్రేమ ఎంత గొప్పదో తెలిసిందే. కానీ అదే ప్రేమ కొన్నిసార్లు హద్దులు దాటితే ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్, సమంత వంటి నటీమణులు అభిమానుల అత్యుత్సాహానికి ఇబ్బంది పడ్డారు. అలాగే బాలీవుడ్ హీరో హర్షవర్థన్ రాణే మూవీ ప్రమోషన్లలో పాల్గొనగా అభిమానులు చొక్కా చించేసిన ఘటన కూడా వైరల్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ కూడా అదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇటీవల మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విజయ్ చివరి సినిమాగా ప్రకటించిన 'జన నాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఓపెన్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం నిజంగా సినిమా పండుగను తలపించింది. లక్షలాది మంది అభిమానులు హాజరుకాగా, భారీ స్టేజ్ సెటప్, ఇంటర్నేషనల్ లెవల్ లైటింగ్, సౌండ్ డిజైన్ ఈ ఈవెంట్‌కు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చాయి. ఈ ఈవెంట్‌లో 'దళపతి కచేరి' పాటకు విజయ్ స్టేజ్‌పై స్వయంగా డ్యాన్స్ చేయడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

Thalapathy Vijay Falls at Chennai Airport Amid Fan Frenzy After Jana Nayagan Audio Launch

ఈ కార్యక్రమం అనంతరం విజయ్ చెన్నైకి తిరిగొచ్చారు. అయితే మలేషియాలో ఎంత పకడ్బందీగా ఈవెంట్ నిర్వహించారో, చెన్నై ఎయిర్‌పోర్ట్ వద్ద పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. విజయ్ రాగానే ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. విజయ్ ఫ్యాన్స్ ను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించినా, అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా అదుపు తప్పింది.

విజయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చి కారువైపు వెళ్తుండగా, కొందరు అభిమానులు ఆయన్ను దగ్గర నుంచి చూడాలని, ఆయనతో కలిసి సెల్ఫీలు దిగాలని ముందుకు దూసుకొచ్చారు. ఈ తోపులాటలో విజయ్ ఒక్కసారిగా తడబడి కింద పడిపోయారు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిలో క్షణకాలం ఆందోళన కలిగించింది. అయితే వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ టీమ్ ఆయనను చుట్టుముట్టి లేపి, సురక్షితంగా కారులోకి ఎక్కించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. హీరో విజయ్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు అభిమానుల అత్యుత్సాహంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.'ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి' ఇది అభిమానం కాదు.. అత్యుత్సాహం'అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే, మలేషియాలో వేలాది మందితో ఈవెంట్‌ను సాఫీగా నిర్వహించినప్పుడు, చెన్నై ఎయిర్‌పోర్ట్ వద్ద సరైన స్పేస్, సేఫ్టీ మెజర్స్ ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు.

'జన నాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్‌తో విజయ్ తన అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అదే సమయంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటన అభిమానుల ప్రేమ హద్దులు దాటితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి గుర్తు చేసింది. దళపతి విజయ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటనలను చూస్తే అర్థమవుతుంది.

More from Filmibeat

Read more about: vijay malaysia thalapathy vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X