Vijay Leo Trailer Review: విక్రమ్-లియోకి కనెక్షన్... లోకేష్ కనగరాజ్ గూస్ బంప్స్ తెప్పించాడు బ్రో!
దలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లియో. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశఆరు. ఇక ఈ మూవీలో విజయ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అసలు ఆ ట్రైలర్ ఎలా ఉంది.. దాని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దలపతి విజయ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లియో. ఇక ఈ మూవీ డిఫరెంట్ స్టోరీతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన దసర కానుకగా థియేటర్లలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

లియో ట్రైలర్ విషయానికి వస్తే... రెండు నిమిషాల 43 సెకన్లు గా ఉంది. ఇక ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమా లవర్స్ కాకపోయినా... ఈ ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఇక ట్రైలర్ ఓపెనింగ్ లోనే... సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. అంటూ విజయ్ వాయిస్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రోడ్డు మీద అందరు చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరినీ కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ కిల్లర్ ను కాల్చాడు.. అతను కాల్చిన గన్ నీ చేతిలో.. అంటూ విజయ్ వాయిస్ ఇస్తుండగా ఈ స్టోరీని చూపిస్తారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ కనిపిస్తారు.

ఇక ఆ కిల్లర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఆ కిల్లర్ ను చంపిన గన్.. విజయ్ చేతిలో ఉండడంతో విలన్స్ అతని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అది అతను కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా సేమ్ కిల్లర్ ను చంపిన పోలీస్ లానే ఉండడంతో విజయ్ వెనుక పడుతారు. అయితే కుటుంబం జోలికి రావడంతో విజయ్ ఎదురు తిరుగుతాడు.
ఇక కిల్లర్ ను చంపింది లియో అని అర్ధం అవుతుంది. విజయ్ ను పోలీ ఉన్న ఆ వ్యక్తి ఎవరు.. అసలు కిల్లర్ ను లియో ఎందుకు చంపాడు.. అసలు ఈ లియో ఎవరు.. అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తే.. విక్రమ్ సినిమాలోని సీన్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాకు, ఖైదీ సినిమాకు కనెక్షన్ పెట్టాడు. ఇప్పుడు లియోకు విక్రమ్ కు కనెక్షన్ ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











