మాస్టర్ సెన్సార్ పూర్తి.. బాక్సాఫీస్‌పై దాడికి విజయ్ రెడీ

దళపతి విజయ్ మాస్టర్ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న మాస్టర్ సినిమాపై కోలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మామూలుగా అయితే సమ్మర్ కానుకుగా రావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్డౌన్ మూలానా వాయిదా పడుతూ వచ్చింది. దీపావళి వరకు పరిస్థితులు చక్కబడతాయని ఆశించినా కూడా నిరాశే మిగింది.

మాస్టర్ సినిమా అప్డేట్లు రాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండిపోయారు. వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు మాస్టర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా విడుదల చేసిన మాస్టర్ టీజర్ ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇక తెలుగులో ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూసి ఇక్కడా డబ్ చేశారు. దీంతో మాస్టర్ తెలుగు టీజర్ కూడా బాగానే వైరల్ అయింది.

Thalapathy Vijay Master Censored With UA

మాస్టర్ సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. మొత్తానికి మాస్టర్ సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్‌పై దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ట్రైలర్ రిలీజ్ చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెబుతూ.. త్వరలోనే కలుసుకుందామంటూ దర్శకుడు పెట్టిన ట్వీట్ ఫుల్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X