Thalapathy Vijay: సంగీత విడాకుల నోటీసు, త్రిషతో రిలేషన్ రూమర్స్.. దళపతి విజయ్ ఫస్ట్ రియాక్షన్
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య సంగీత నుంచి విడాకుల నోటీసుతో పాటు త్రిషతో ఆయన రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ రావడంతో పాటు సంగీత సైతం పేరు ప్రస్తావించకుండా ఓ నటితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో దళపతిపై సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి తొలిసారిగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా దళపతి విజయ్ వ్యక్తిగతంగానూ, కెరీర్ పరంగానూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన కెరీర్‌లో చివరి సినిమాగా ప్రకటించిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. కోర్టులలో న్యాయ పోరాటం చేస్తున్నా ఇప్పటికీ సినిమా విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆ తర్వాత విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్‌లో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం, సీబీఐలు కేసులు నమోదు చేశాయి. వీటి విచారణకు కూడా విజయ్ హాజరయ్యారు.

ఈ వివాదాలతో సతమతం అవుతున్న వేళ కొద్దిరోజుల క్రితం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. త్రిషతో బంధాన్ని తెంచుకుని బయటకు వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. విజయ్‌కి త్రిషతో ఎఫైర్ సాగుతుందన్న అర్ధంలో ఆయన వ్యాఖ్యలు చేయడంతో తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిరోజులకే విజయ్ సతీమణి సంగీత తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది.
విడాకుల కారణాలతో విజయ్‌కి ఓ నటితో ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు అందరి వేళ్లూ త్రిషపైనే చూపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై త్రిష, విజయ్ మౌనంగానే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ జంట షాకిచ్చింది. చెన్నైలో జరిగిన ఓ నిర్మాత కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్ - త్రిష జంటగా వెళ్లడం ఈ ఆరోపణలకు, ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ పరోక్షంగా ఇలా తమ బంధాన్ని బయటపెట్టారా అంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ తర్వాత గంటలు గడవకముందే విజయ్‌పై మరోసారి కోర్టును ఆశ్రయించారు సంగీత. తనను విజయ్ ఇంట్లోకి రానివ్వడం లేదని.. విడాకుల పంచాయతీ తేలేవరకు నేను విజయ్‌తో పాటు చెన్నై నివాసంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో విజయ్ మరిన్ని చిక్కుల్లో పడినట్లయ్యింది.
త్రిషతో ఎఫైర్ రూమర్స్, సంగీత విడాకుల నోటీసు తదితర అంశాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విజయ్.. తొలిసారిగా స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా శనివారం చెంగల్పట్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తన వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై మీరు పోరాటం చేసి వాళ్లను బధించాల్సిన అవసరం లేదు.. వీటి సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం ప్రజా సమస్యలపై పోరాడండి. నా వ్యక్తిగత జీవితంలోని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎంతో బాధగా ఉందని దళపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి


Click it and Unblock the Notifications











