Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ కుటుంబ వ్యవహారం దక్షిణ భారత సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆయన సతీమణి సంగీత విజయ్ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కారణాలలో ఒకటిగా తన భర్తకు ఓ సినీనటితో ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రస్తావించారు. కానీ సదరు నటి ఎవరు? అన్నది మాత్రం సంగీత ప్రస్తావించలేదు. అయితే ఆ నటి త్రిష అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి.
త్రిష పేరునే ప్రస్తావించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీరిద్దరు కలిసి సినిమాలు చేయడంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. నాటి నుంచే త్రిష- విజయ్ రిలేషన్‌లో ఉన్నట్లుగా అనేకమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి త్రిష పేరును ఆయనకు లింక్ చేస్తూ ప్రత్యర్ధులు విమర్శలు సంధిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయ్‌కి రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదని.. ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.

అయితే వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించారు. సంబంధం లేని విషయాల్లో తన పేరును లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. దాంతో దిగొచ్చిన నాగేంద్రన్ ... త్రిషకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ముగిసిన కొద్దిరోజులకే తనకు విడాకులు కావాలంటూ దళపతి విజయ్ భార్య .. సంగీత విజయ్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళ, సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నుంచి విడాకులు కోరడానికి ప్రధాన కారణాల్లో నటితో అక్రమ సంబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు సంగీత. కానీ ఆ నటి ఎవరు? అన్నది మాత్రం వెల్లడించలేదు.
సంగీత ఆరోపణలతో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయ్యింది. త్రిషకు, విజయ్‌కు మధ్య ఏదో నడుస్తోందని అందరూ అనుమానించే పరిస్ధితి నెలకొంది. ఇంత జరుగుతున్నా విజయ్ కానీ, త్రిష కానీ ఈ వార్తలపై స్పందించడం లేదు. వారి మేనేజర్లు, ఇతర సిబ్బంది కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్- త్రిషలు షాకిచ్చారు. గురువారం రాత్రి చెన్నైలో జరిగిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత, నిర్మాత కల్పతి ఎస్ సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు దళపతి విజయ్, త్రిష జంటగా హాజరయ్యారు. ఇద్దరూ ఒకే కారులో వచ్చి.. కలిసి వేదికపైకి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించి ఫోటోలకు ఫోజులిచ్చారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. త్రిషతో తన బంధంపై విజయ్ ఇలా హింట్ ఇచ్చారా? ఇకపై దాయడానికి ఏం లేదన్నట్లుగా వీరు తమ బంధాన్ని బహిర్గతం చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో దళపతి విజయ్ బాడీగార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 6.5 అడుగుల ఎత్తుతో, కండలు తిరిగిన దేహంతో విజయ్‌ని కంటికి రెప్పలా కాపడుతూ ఉంటాడు అరూన్ సురేష్. పలు ఈవెంట్స్‌లో ఇతని లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ అభిమానుల్లోనూ ఇతనికి క్రేజ్ ఉంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అరూన్ తాజాగా ఇన్‌స్టా స్టోరీలో ఓ చిన్న లైన్ రాసుకొచ్చాడు. అన్ని పుకార్లను అధిగమించే సమయం ఆసన్నమైందన్నది దాని సారాంశం. విజయ్ అభిమానులకు హార్ట్ సింబల్‌తో అభివాదం చేస్తున్న ఫోటోకు బ్యాక్‌గ్రౌండ్‌లో త్రిష- విజయ్ నటించిన గిల్లి సినిమాలోని సాంగ్‌ను జత చేసి ఈ పోస్ట్ పెట్టాడు. క్షణాల్లో ఇది వైరల్ కాగా.. దీనిని అరూన్ డిలీట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం దీని స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో త్రిష- విజయ్‌లు రిలేషన్‌లో ఉన్నారని అర్ధం వచ్చేలా అరూన్ పోస్ట్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











