దళపతి విజయ్ వెనక్కి తగ్గరు... జన నాయగన్‌తో తమిళనాడు షేకే... అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ విడుదలపై హైడ్రామా నెలకొంది. సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. దాంతో పెద్ద పండక్కి తమ అభిమాన హీరో సినిమా చూడాలని అనుకున్న కోట్లాది మంది అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు.. జన నాయగన్ విడుదల ఆగిపోవడం వెనుక రాజకీయ ఒత్తిడి, కుట్ర ఉన్నాయంటూ టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా జన నాయగన్‌పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు.
జన నాయగన్ తారాగణం
జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్ రిలీజ్ అవుతుందని నిర్మాతలు ముందే ప్రకటించారు

జన నాయగన్ విడుదల వాయిదా
రాజకీయాల్లోకి వెళ్లిపోతుండటంతో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించారు. దాంతో జన నాయగన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ విషయంలో పలు అభ్యంతరాలు రావడం... ఎంతకూ బోర్డ్ నుంచి నిర్ణయం వెలువడకపోవడంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 9వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కోర్ట్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల మధ్య జన నాయగన్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే జన నాయగన్‌కు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్ట్ తీర్పు వెలువరించడంతో సినిమా విడుదలవుతుందని అంతా భావించారు.
జన నాయగన్ సెన్సార్‌పై వివాదం
అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై సెన్సార్ బోర్డ్.. ద్విసభ్య ధర్మాసనంలో అప్పీల్ చేయడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మద్రాస్ హైకోర్ట్ ద్విసభ్య బెంచ్ స్టే విధించింది. అనంతరం తుది తీర్పును జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జన నాయగన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు... విడుదలకు ముందే జన నాయగన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్‌గా జన నాయగన్ ప్రచారం జరిగింది. ఇది రీమేక్ కాదని.. పూర్తిగా దళపతి విజయ్ చిత్రమని జన నాయగన్ దర్శకుడు వినోద్ తెలిపారు. అయితే ఈ చిత్ర ట్రైలర్‌తో అందరి ప్రశ్నలకు సమాధానం దొరికింది. మెజారిటీ కథతో పాటు పాత్రలు, సన్నివేశాలు భగవంత్ కేసరి మాదిరిగానే కనిపించాయి.
జన నాయగన్ ఎప్పుడొచ్చినా రికార్డ్స్ బ్రేకే
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవంత్ కేసరికి రీమేక్‌గా జన నాయగన్‌ను తీసుకున్నారా? లేదా? అని యాంకర్ ప్రశ్నించారు. దానిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మీ సినిమా మీకే పోటీగా వస్తుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది.. మీమ్స్ కూడా వచ్చాయి. జన నాయగన్ ట్రైలర్ నాకు నచ్చింది. విజయ్ లాంటి స్టార్‌ను పెట్టుకుని మంచి హై ఎండ్ యాక్షన్ తీస్తున్నారు, స్పాన్ పెంచారు. కథలో ఇంకా ఏవో నెక్ట్స్ లెవల్ థింగ్స్ పెట్టినట్లున్నారు. కానీ సోల్ మాత్రం భగవంత్ కేసరే. నాకైతే నచ్చింది.. ఖచ్చితంగా విజయ్ గారి లాస్ట్ సినిమా ఎప్పుడొచ్చినా రికార్డ్స్ అన్నీ షేక్ అయిపోతాయని మాత్రం చెప్పగలను అని అనిల్ అన్నారు.
విజయ్ పట్టుబడితే తగ్గరు
అప్పట్లో ఈ సినిమా విజయ్ గారితో మీరే చేయాలని టాక్ నడిచింది? మీరెందుకు మిస్ చేసుకున్నారని యాంకర్ ప్రశ్నించగా.. దళపతి విజయ్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. ఏదైనా స్ట్రెయిట్ సబ్జెక్ట్ చేస్తానని విజయ్ గారికే చెప్పాను. విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్... పైగా రీమేక్ అంటే ఎలా ఉంటదోననే భయం ఉంది. కానీ విజయ్ గారికి భగవంత్ కేసరి బాగా నచ్చింది. అందులోని కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. అందుకే ఆయన పట్టుబట్టి వెనక్కి తగ్గకుండా ఆ సినిమాను చేశారు. చాలామంది ఎందుకు రీమేక్ అని భయపెట్టినా.. విజయ్‌గారు సినిమాను బాగా నమ్మారు. ఖచ్చితంగా ఆయన నమ్మింది వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నాను. ఆడపిల్లల గురించి చెప్పిన పాయింట్స్ కానీ.. విజయ్ గారు చెబితే స్ట్రాంగ్‌గా జనాల్లోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఫ్యాన్స్‌కి కావాల్సినంత స్టఫ్ ఆ సినిమాలో ఉంది. జన నాయగన్ రిలీజ్ అయ్యాక తమిళనాడు షేక్ అయిపోతుందని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్, టాలీవుడ్‌లలో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











