తమిళనాడు ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. దళపతి విజయ్‌కు షాక్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈసారైనా అధికారాన్ని అందుకోవాలని అన్నాడీఎంకే.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే.. తన సత్తా చాటాలని కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్.. కింగ్‌మేకర్‌గా మారాలని చిన్నాచితకా పార్టీలు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. అయితే అందరిచూపు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పైనే ఉంది. మూడున్నర దశాబ్ధాల సినీ జీవితాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి దిగిన దళపతి.. దిగ్గజాల సరసన చోటు దక్కించుకుంటాడా? తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటుతాడా? అంటూ తమిళ ప్రజలతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌తో పెట్టుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు చివరి వరకు ప్రయత్నించాయి. అయితే దళపతి మాత్రం ఒంటరిగానే పోటీకి మొగ్గుచూపారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తను అనుకున్న వాళ్లకే దళపతి టికెట్లు కేటాయించారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు దళపతి. సామాన్యులతో పాటు వివిధ పార్టీల నుంచి చేరినవారితో పాటు అన్ని వర్గాలకు విజయ్ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. అలాగే తన దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కొడుక్కి కూడా టికెట్ కేటాయించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

Thalapathy Vijay s nomination papers don t match Will TVK chief s Perambur nomination be rejected

ఇక తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి దళపతి షాకిచ్చారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్ధుల ప్రకటన కొలిక్కిరావడంతో విజయ్ ప్రచారంలో దూకుడు పెంచారు. అలాగే తను పోటీ చేస్తున్న స్థానాల్లో నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికల సరళిని పరిశీలిస్తూ.. వ్యూహాత్మకంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న విజయ్‌ ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో పరస్పర విరుద్ధమైన సమాచారం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నామినేషన్ పత్రాల్లో పెరంబూరులో ఒకలాగా, తిరుచ్చి ఈస్ట్‌లో మరోలా సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరంబూరు అఫిడవిట్‌లో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ సమర్పించిన విజయ్... తిరుచ్చి ఈస్ట్‌లో ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం తనపై ఓ పోలీస్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే మరో కేసు కూడా పెండింగ్‌లో ఉన్నట్లుగా ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో విజయ్‌పై ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నారు. రెండు చోట్లా వేర్వేరుగా తప్పుడు సమాచారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే కేసు విషయం తనకు ముందుగా తెలియదని విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు.. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం నేపథ్యంలో టీవీకే అధినేతకు ప్రమాదం పొంచి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. అభ్యర్ధులు తమ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచినట్లు తేలితే దానిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అఫిడవిట్‌ను పరిశీలించి.. తప్పుడు సమాచారమని తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనేందుకు ఎన్నికల సంఘానికి అధికారముంది. అభ్యర్ధిత్వాన్ని కూడా రద్దు చేసి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో విజయ్ నామినేషన్ రద్దవుతుందా? అంటూ తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద తొలిసారి ఎన్నికలకు వెళ్తున్న దళపతి విజయ్‌కి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. మరి ఈ వివాదం నుంచి టీవీకే అధినేత ఎలా బయటపడతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X