Vaarasudu Trailer Review ఎమోషన్స్‌తో కుమ్మేసిన విజయ్, వంశీ పైడిపల్లి.. రికార్డు వ్యూస్‌తో ట్రైలర్ ధమాకా!

తమిళ ఇళయ దళపతి విజయ్ హీరోగా ముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం వారసుడు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వారసుడు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే భారీగా వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తున్నది. ఈ ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..

వారసుడు ట్రైలర్ ముగ్గురు అన్మదమ్ములతో కూడిన కుటుంబ కథా చిత్రం. ఉమ్మడి కుటుంబంలో కలతలు, విభేదాల నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. బిజినెస్ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ తలదూర్చడం, విజయ్ తన కుటుంబాన్ని రక్షించుకొనేందుకు అతడికి ఎలా బుద్ది చెప్పారనే కథను చాలా ఎమోషనల్‌గా, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది.

 Thalapathy Vijays Vaarasudu aka Varisu trailer review: Vijay, Vamshi Paidipally made mark on Audience

వారసుడు చిత్రంలో పాత్రల మధ్య భావోద్వేగాలు, ఫీల్ గుడ్ డైలాగ్స్, ప్రేక్షకులను ఈలలు వేసే మాటల తూటాలు ట్రైలర్‌లో పేలాయి. ఇలాంటి వైవిధ్యం ఉన్న ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

వారసుడు ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు హిట్స్ సాధించేందుకు దూసుకెళ్తున్నది. ఈ ట్రైలర్‌కు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలపై భారీగా రెస్సాన్స్ వస్తున్నది.

నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ఆర్ శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ షామ్, శ్రీకాంత్, కుష్బు, యోగి బాబు, జయసుధ, సంగీత, నందిని రాయ్, జాన్ విజయ్, భరత్ రెడ్డి తదితరులు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: రాజు, శిరీష్
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హర్షిత
సంగీతం: ఎస్ థమన్
డైలాగ్స్: శ్రీనివాస్ చక్రవర్తి
సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్
పీఆర్వో: వంశీ శేఖర్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-01-12

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X