‘భర్తతో సంగీత విడాకులు అందుకే... సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్‌ అనర్హుడు’

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్. ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలకు తోడు ఆయన సతీమణి సంగీత విజయ్ విడాకులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. విజయ్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని సంగీత నిర్ణయించుకోవడం కారణం ఏంటీ అంటూ కోలీవుడ్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ వెంటనే కొడుకు జాసన్ విజయ్ కూడా తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం.. దళపతి కుటుంబంలో ఏదో జరుగుతోందన్న సంకేతాలను పంపింది.

ఇక చెంగల్పట్టు కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో తన భర్త విజయ్‌పై పలు అభియోగాలను మోపారు. విజయ్‌ది క్రూరమైన మనస్తత్వమని అతని ప్రవర్తన వల్ల తాను కొన్నేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొంది. సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటితో 2021 నుంచి విజయ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని.. దీనిపై నిలదీసినా కనీసం పట్టించుకోలేదుని ఆమె ఆరోపించారు. తనపై సూటిపోటి మాటలతో దాడి చేయడం, తన వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించడం వంటి చర్యలు కొనసాగించాడని విజయ్‌పై ఆరోపణలు చేశారు. అయితే అన్నింటిలోకి విజయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ - సంగీతల వ్యవహారంపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Thalapathy Vijay- Sangeetha Sornalingam Divorce case Producer Natti Kumar comments on TVK Chief s Controversy

27 సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఎవరో చెప్పారని.. పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని భర్తపై సంగీత అభియోగాలు చేయదు. కోటాను కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి.. ఆమెకు ఆస్తుల్లో వాటా ఉంది, బిడ్డలకు భాగస్వామ్యం ఉంది. దళపతి విజయ్ అంటే ప్రపంచంలో తెలియని వారుండరు. అలాంటి వీవీఐపీ భార్య సంగీత.. ఆమె ఎందుకు ఇలాంటి అభియోగాలు చేస్తుందనేది ఆలోచించాలి. 27 సంవత్సరాల కాపురం చేసిన ఈ భర్త నాకొద్దు.. నాకు విడాకులు ఇవ్వండని ఒక ఆడబిడ్డ బయటికొచ్చి అడిగింది అంటే.. దీని వెనుక రాజకీయం కనిపిస్తుందా? ఆడపిల్ల కష్టం ఉందా? అనేది ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఆమెకు ఏ లోటు ఉందని భర్తపై అభియోగం చేస్తుంది? కేసు వేయకుండా ఉంటే విజయ్ భార్యగా పేరు, డబ్బు, హోదాతో పాటు పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. కానీ నీ ఆస్తి వద్దు, నీ ఐశ్వర్యం వద్దు.. నా పిల్లలతో నేను వేరుగా ఉంటాను విముక్తి కలిగించమని కోర్టును అడిగింది. అంటే అక్కడే విజయ్ గారు కుటుంబం విషయంలో ఎంత ఫెయిల్ అయ్యారో కనిపిస్తూనే ఉంది. తల్లిదండ్రుల దగ్గరా ఫెయిల్యూర్ అయ్యాడు. విజయ్‌ని హీరోగా నిలబెట్టడానికి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఎంతో కష్టపడ్డారు అని నట్టికుమార్ పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రితమే విజయ్‌తో సంగీత శారీరకంగా విడిపోయింది. తల్లిదండ్రుల్ని కూడా విజయ్ సరిగా చూసుకోలేదు. తల్లిదండ్రుల మీద కూడా మూడేళ్ల కేసు పెట్టాడు. తల్లిదండ్రుల దగ్గరా సఖ్యత లేదు.. భార్య దగ్గరా సఖ్యత లేదు.. పిల్లల దగ్గరా సఖ్యత లేదు. కుటుంబాన్నే సవ్యంగా నడపలేని వాడివి, తమిళనాడు రాష్ట్రానికి నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఇంత పెద్ద కుటుంబాన్ని ఏం చూసుకుంటావు. అందరితో గొడవలు పెట్టుకుని ఒంటరిగా మిగిలిపోయావు.. రాజకీయంగా మీరు పనికొస్తారా? పనికిరారా? అనేది మీరే ఆలోచించుకోవాలి. కుటుంబంలో జరుగుతున్న కథని ప్రచారంలో చెబుతారా? నాలాగా ఉండండి, నాలాగా నడవండి అని చెబుతారా? తమిళనాడు ప్రజలకు మీరు ఏం చెబుతారు అని నట్టికుమార్ ప్రశ్నించారు.

డీఎంకే పార్టీ ద్వారా కరుణానిధి గారు ఎప్పటి నుంచో పాలిస్తూ వచ్చారు.. వారసత్వంగా స్టాలిన్ గారు వచ్చారు. బీజేపీ, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లు కూడా వారి హయాంలో ఏం చేశాయో ప్రజలు చూశారు. ఆ పార్టీలతో రాజకీయంగా మీకు విభేదాలు ఉండొచ్చు.. కానీ మీ భార్య మీపై చేస్తున్న ఆరోపణలపై ఇది తప్పు, తప్పుడు ప్రచారం, నన్ను చులకన చేయడం కోసం చేసింది అనడానికి మీరు చెప్పడానికి ఆధారాలు చూపించండి. ఆవిడ మీతో ఉంటానని చెప్పడం లేదు.. మీ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, నా పిల్లల పరిస్ధితి ఏంటీ అని అడగటం లేదు. నాకు విజయ్‌తో కాపురం వద్దు.. నాకు విడాకులు ఇవ్వమని అడిగింది కోర్ట్‌ని. నా పిల్లల్ని కూడా చూసుకోని తండ్రి నాకు వద్దు, నాకు విముక్తి కలిగించమని అడుగుతోంది. అక్రమ సంబంధాలు ఎన్ని పెట్టుకున్నా భరించి చివరికి సహనం నశించి ఆమె విముక్తి కోరుతోంది. నాకు ఈ నరకం వద్దు.. ఈ సెలబ్రిటీ స్టేటస్, నీ సెక్యూరిటీ వద్దు అని సంగీత అంటున్నారు అని నట్టికుమార్ పేర్కొన్నారు.

ప్రజలు విజ్ఞులు.. రేపు ఓటేసే సమయంలో డీఎంకే ఏంటీ? కొత్తగా వచ్చిన విజయ్ గారు ఏంటీ? అన్నాడీఎంకే ఏంటీ? అనేది చెక్ చేసుకుంటారు. మనందరి కంటే తమిళనాడు, కేరళ ప్రజలు చాలా విజ్ఞులు. కనుక ఆలోచించి ఓటేస్తారు. సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చేశాడని చీఫ్ మినిస్టర్‌ని చేయరు.. హీరోగా నువ్వంటే ఇష్టమే, కానీ ఓటు మాత్రం నాకు పనిచేసే వ్యక్తికే వేస్తాను. సినిమా హీరో వేరు.. రాజకీయం వేరు. వీటన్నింటినీ బట్టి చూస్తే రాజకీయంగా విజయ్‌కి గట్టి దెబ్బ తగలడం ఖాయం. సంగీత గారికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. భార్య చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయ్‌దే అని నట్టికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X