Thalapathy Vijay's Net Worth: హాట్ టాపిక్‌గా దళపతి విజయ్ ఆస్తులు.. టీవీకే చీఫ్ సంపద ఎన్ని వందల కోట్లంటే?

కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కి ఆయన సతీమణి సంగీత విజయ్ విడాకుల నోటీసు ఇవ్వడం తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఓ నటితో వివాహేతర సంబంధం కారణంగా తన భర్త తనను వేధిస్తున్నాడని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే జననాయగన్‌ విడుదల ఆగిపోగా.. ఇంటా బయటా సమస్యలతో సతమతం అవుతున్న విజయ్‌కి ఇప్పుడు భార్య నుంచి గట్టి షాక్ తగలింది. ఈ పరిస్ధితుల నుంచి ఆయన ఎలా బయటపడతారు అన్నది చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో విజయ్ ఆస్తులపై అందరి కన్ను పడింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత ఆస్తులు ఎన్ని కోట్లు అనేది పరిశీలిస్తే..

దళపతిగా విజయ్ శకం
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. అభిమానులంతా దళపతిగా పిలుచుకునే ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతులకు 22 జూన్ 1974న మద్రాస్‌లో జన్మించారు విజయ్. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తండ్రి దర్శకుడు కావడంతో పదేళ్ల వయసులోనే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించారు విజయ్. ఆ తర్వాత 1992లో నాలయ తీర్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. అనంతరం వరుస బ్లాక్‌బస్టర్లతో స్టార్ హీరోగా నిలిచారు. కమల్ హాసన్ - రజనీకాంత్‌ల శకం ముగుస్తున్న దశలో తమిళ చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా మారి.. తన చిత్రాలతో తమిళ సినిమాల మార్కెట్‌ను పెంచారు.

Thalapathy Vijay s Net Worth taka A look at TVK chief s wealth amid Sangeetha Sornalingam s infidelity allegations and divorce

సంగీతతో పెళ్లి, పిల్లలు
1999లో సంగీత సోర్ణలింగంను పెళ్లి చేసుకున్నారు విజయ్. ఆమె తండ్రికి శ్రీలంక, యూకేలలో ఆస్తులు ఉండటంతో బడా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు జాసన్ విజయ్, కుమార్తె దివ్య సాషా. జాసన్ ఇటీవలే దర్శకత్వ శాఖలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. కుమార్తె చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

విజయ్ ఆస్తులు ఎంత?
30 ఏళ్ల కెరీర్‌లో విజయ్ సంపద బాగానే పెరిగింది. సినిమాల రెమ్యునరేషన్, ఇతర వ్యాపారాలతో ఆయనకు ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తోంది. చెన్నైలో సముద్ర తీరానికి అభిముఖంగా విలాసవంతమైన బంగ్లాతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి. విజయ్ గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్ 5, ఆడీ ఏ8 ఎల్, రేంజ్ రోవర్ ఎవాక్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో ఎక్స్‌సీ 90, మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఏ వంటి కోట్లు విలువ చేసే ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. జన నాయగన్ చిత్రానికి గాను ఏకంగా 220 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా చరిత్ర సృష్టించాడు దళపతి. మొత్తంగా విజయ్ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయల పైమాటేనని అంచనా.

సంగీత ఆస్తులు ఎంత?
విజయ్‌కే కాదు.. సంగీతకు కూడా బాగానే ఆస్తులు ఉన్నాయి. పుట్టుకతోనే బిలియనీర్ అయిన సంగీతకు తమిళనాడు, శ్రీలంక, యూకేలలో ఆస్తులు ఉన్నట్లుగా కోలీవుడ్ వర్గాల టాక్. సినీ వర్గాల సమాచారం ప్రకారం సంగీత ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయల పైమాటే. ఆమెకు ఎలా ఆదాయం వస్తుంది? సంగీత వ్యాపారాలు చేస్తున్నారా? అనేది మాత్రం తెలియరాలేదు. మీడియాకు దూరంగా ప్రైవేట్‌గా ఉండే సంగీత లో ప్రోఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. దాంతో విజయ్ - సంగీత ఉమ్మడి ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయల పైనే ఉంటుందని టాక్. తమిళ సినీ, రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇద్దరూ ఉండటంతో విజయ్ - సంగీతల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X