Thalapathy Vijay: దళపతి విజయ్‌కి కొడుకు షాక్... ఊహించని దెబ్బకొట్టేలా జాసన్ ప్లానింగ్?

కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ వ్యక్తిగతంగా, వృత్తిగతంగా గడ్డు పరిస్ధితుల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన జన నాయగన్ సినిమా విడుదల ఆగిపోవడంతో పాటు కరూర్ తొక్కిసలాట కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆయన భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో కేసు వేయడం కలకలం రేపింది. విడాకుల కారణాలలో ఓ ప్రముఖ నటితో తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధాన్ని ప్రస్తావించింది. దాంతో బయటా విజయ్ తీవ్ర సమస్యలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.

ఈ పరిణామాలకు కొద్దిరోజుల ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ సైతం త్రిషతో బంధానికి విజయ్ చెక్ పెట్టాలని, ఆమె ఇంటి నుంచి బయటకు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిషకు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పినప్పటికీ నాగేంద్రన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతలోనే సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దాంతో త్రిష- విజయ్ రిలేషన్‌పై మీడియాలో చర్చ జరిగింది. దీనిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే ఓ వివాహ కార్యక్రమానికి త్రిష, విజయ్ జంటగా హాజరవ్వడంతో వీరిద్దరూ తమ బంధాన్ని బహిర్గతం చేశారా? అంటూ జనంలో చర్చ మొదలైంది.

Thalapathy Vijay s son Jason Sanjay changes surname shocks tamilnadu amid Vijay Trisha Krishnan controversy

అప్పటి వరకు విజయ్‌కి సపోర్ట్ చేసిన వారు సైతం ఈ పరిణామాలతో మండిపడుతున్నారు. స్వయంగా టీవీకేకు చెందిన నేతలు, విజయ్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఇంట్లో తనకు చోటు లేదని.. లండన్ నుంచి వస్తే ఎక్కడ ఉండాలో అర్ధం కావడం లేదని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పంచాయతీ తేలే వరకు చెన్నైలోని విజయ్ నివాసంలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు సంగీత. తల్లిదండ్రుల మధ్య గొడవల నేపథ్యంలో విజయ్ పిల్లలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా కుమారుడు జాసన్ విజయ్.. తాను తల్లిపక్షమేనని నిరూపించారు. విడాకుల పిటిషన్ దాఖలైన వెంటనే తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు జాసన్. తాజాగా విజయ్‌కి మరో షాకిచ్చాడు ఈ కుర్రాడు.

ఇప్పటి వరకు జాసన్ విజయ్ అంటూ తన తండ్రి పేరును చివర ఉంచుకున్నాడు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తన పేరులోని తండ్రి విజయ్ పేరులోని మొదటి అక్షరం వి స్థానంలో తల్లి సంగీత పేరులోని మొదటి అక్షరం ఎస్‌ను చేర్చుకుని జాసన్ విజయ్ కాస్తా జాసన్ సంజయ్‌గా మార్చుకున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో తన పేరును మార్చుకున్నాడు. అలాగే తన కొత్త సినిమా టైటిల్ కార్డ్‌లోనూ ఇదే పేరు ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

హీరోగా కాకుండా దర్శకుడిగా మారిన జాసన్ సంజయ్.. సిగ్మా పేరుతో ఓ యాక్షన్ సినిమాను తెరకెక్కించాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇకపోతే.. ఇటీవల ఈరోడ్‌లోని ఓ ఫ్యాక్టరీని సందర్శించిన సంజయ్.. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. అలాగే వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజయ్ చాలా నిరాడంబరంగా, ఒక సాధారణ యువకుడిలా కార్మికుల మధ్య నిలబడి ఆకట్టుకుంటున్నాడు. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తుండగా... ఎవరూ ఊహించని విధంగా సంజయ్ జనంలోకి వెళ్లడం ఏంటీ? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? ఈరోడ్‌లోని సదరు ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్లాడు? జాసన్ తన తండ్రికి వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే విజయ్‌కి పోటీగా సంజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి విజయ్ విడాకులు, ఆయన కుటుంబంలోని వివాదాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X