దళపతి విజయ్‌కి బిగుస్తోన్న ఉచ్చు... మళ్లీ కోర్టుకెక్కిన సంగీత, భర్తపై సంచలన ఆరోపణలు
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ - అతని భార్య సంగీత విజయ్‌ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. తన భర్త నుంచి విడాకులు కావాలని ఇప్పటికే ఆమె చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తాజాగా సంగీత విజయ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన భర్త విజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా దళపతి విజయ్‌కి పేరు. తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, గల్ఫ్ దేశాలు, నార్త్ అమెరికాలో విజయ్‌కి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించాయి. జన నాయగన్ సినిమాకు ఏకంగా 220 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని సంచలనం సృష్టించాడు దళపతి.

మూడు దశాబ్ధాలకు పైగా తమిళ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న విజయ్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనేక తర్జన భర్జనలు, సమావేశాల అనంతరం తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనే పార్టీని స్థాపించారు. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా, మూడు దశాబ్ధాల కెరీర్‌ను ప్రజల కోసం వదులుకుని రాజకీయాల్లోకి దిగారు. నాటి నుంచి తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు విజయ్.
మరో రెండు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది అనగా విజయ్ ఊహించని విధంగా ఇబ్బందుల్లో పడ్డారు. తన భర్త నుంచి తనకు విడాకులు కావాలని విజయ్ సతీమణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటితో అక్రమ సంబంధం ఉందని.. ఈ విషయం తనకు తెలిసినప్పటి నుంచి ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని సంగీత ఆరోపించారు. దానికి కొద్దిరోజుల ముందే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం విజయ్‌కి త్రిషతో సంబంధం ఉందని, త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే ఆయనకు వాస్తవాలు తెలుస్తాయని ఆరోపించారు.
సంగీత, నాగేంద్రన్ వ్యాఖ్యలకు సారుప్యత ఉండటంతో త్రిష- విజయ్ రిలేషన్‌పై చర్చ మొదలైంది. ఇంత జరుగుతున్నా ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ పెళ్లి వేడుక కోసం త్రిష, విజయ్ జంటగా ఒకే కారులో వెళ్లడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాంతో త్రిష- విజయ్‌లు తమ బంధాన్ని ఇలా బహిర్గతం చేశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఈ చర్యను సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ సతీమణి సంగీత షాకిచ్చారు. మరోసారి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోట్లు సంపాదించే నా భర్త ఇంట్లో నాకు స్థానం లేదు. చెన్నై రోడ్లపై నేను నిరాశ్రయురాలిని. బ్రిటీష్ పౌరసత్వం ఉన్న నాకు చెన్నైలో సొంతిల్లు కూడా లేదు. లండన్ నుంచి నగరానికి వచ్చినప్పుడు చెన్నై నీలంకరైలోని మా ఇంట్లోకి నా భర్త రానివ్వడం లేదు. ఆ నివాసంలో సగం వాటా నాదే, విడాకుల పంచాయతీ తేలే వరకు తనను ఈ ఇంట్లో నుంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని సంగీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఇంట్లో ఉండేందుకు తనను అనుమతించేలా తన భర్తను ఆదేశించాలని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓ వైపు త్రిషతో చక్కర్లు, మరోసారి సంగీత కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ ఇమేజ్‌పై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











