డిస్కో రాజాపై తమన్ కామెంట్స్.. హిట్ గ్యారెంటీనా..?

నటుడిగా, ప్రతినాయకుడిగా చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు రవితేజ. మాస్ సినిమాలకు, హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజకు ప్రస్తుతం టైమ్ కలిసి రావడం లేదు. ఒక హిట్ కొడితే మూడు ఫ్లాపులన్న చందంగా మారింది. రాజా ది గ్రేట్ తరువాత మరో హిట్ కొట్టలేకపోయాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని, నేల టికెట్ అంటూ డిజాస్టర్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్‌తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొదటి సారి తన స్టైల్‌ను మార్చుకుని మాస్ మంత్రం జపించకుండా.. కొత్తదనాన్ని ట్రై చేస్తున్న రవితేజకు హిట్ లభించేలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి తమన్ మాట్లాడుతూ.. రవితేజ కెరీర్‌లో మంచి చిత్రమవుతుందని అన్నాడు. అదొక డిఫరెంట్ కథ అని, చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తమన్ మాటలు వింటుంటే.. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే భావనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు.

Thaman About Ravi Teja Disco Raja

ఈ మూవీ నుంచి డిసెంబర్ 6న టీజర్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు సమానంగా వుండే ఈ సినిమాను జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X