థమన్‌కు మరో బంపర్ ఆఫర్.. బాస్‌పై ప్రేమను చూపించే సమయం ఆసన్నమైంది!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా కొనసాగుతున్నాడు తమన్. 2020లో అల.. వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టినప్పటి నుంచి అతని స్పీడ్ మామూలుగా లేదు. బ్యాక్ తో బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అలాగే మంచి మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు. ఇక అతని సినీ కెరీర్ లో మొదటిసారి ఒక డ్రీమ్ నిజం కాబోతోంది. బిగ్గెస్ట్ స్టార్ సినిమాకు ట్యూన్స్ సెట్ చేయబోతున్నాడు.

Recommended Video

Thaman signs for megastar Chiranjeevi Lucifer Remake | Filmibeat Telugu
ఆ ఒక్కక్ సినిమా తరువాత..

ఆ ఒక్కక్ సినిమా తరువాత..

అల.. వైకుంఠపురములో సినిమా విజయంలో త్రివిక్రమ్ డైరెక్షన్ తో పాటు థమన్ పాత్ర ఎంతో ఉంది. అదే 2020 బెస్ట్ ఆల్బమ్ గా కూడా నిలిచింది. ఈ ఆల్బమ్ అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 1 బిలియన్ వ్యూవ్స్ సాధించింది. అయితే చిరస్మరణీయ సంవత్సరం తరువాత, తమన్ ఇప్పుడు 10 ప్రాజెక్టులతో 2021కి స్వాగతం పలుకుతున్నాడు.

మొదటిసారి మెగాస్టార్ సినిమాకు

మొదటిసారి మెగాస్టార్ సినిమాకు

ఇక రీసెంట్ గా మరో బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి మెగాస్టార్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఎన్నో ఏళ్లుగా థమన్ ఈ అవకాశం కోసం కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ఆ రీమేక్ సినిమాకు..

ఆ రీమేక్ సినిమాకు..

చివరగా థమన్ మెగాస్టార్ సైరా సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్స్ కు మాత్రమే మ్యూజిక్ అంధించాడు. చాలా కాలంగా మెగాస్టార్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నప్పటికి ఆఫర్స్ రావడం లేదు. ఇక ఫైనల్ గా లూసిఫర్ రీమేక్ కు సంగీతం అంధించే ఛాన్స్ అందుకున్నాడు. ఆ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

బిగెస్ట్ డ్రీమ్ అంటూ..

బిగెస్ట్ డ్రీమ్ అంటూ..

ఇక సోషల్ మీడియా ద్వారా స్పందించిన థమన్.. ఏ కంపోజర్ కైనా కూడా ఇది బిగెస్ట్ డ్రీమ్ అంటూ బాస్ పై నా ప్రేమను చూపించే టైమ్ వచ్చిందని, తెలుగు లూసిఫర్ తో మా జర్నీ మొదలు కానుందని ట్వీట్ చేశాడు. ఈ ఆఫర్ తో 2020లో టాలీవుడ్ లో అత్యదిక సినిమాలకు కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా థమన్ ఒక క్రేజ్ అందుకుంటున్నాడని చెప్పవచ్చు. థమన్ చేతిలో ఇప్పటికే పధికి పైగా సినిమాలున్నాయి. మరి మెగాస్టార్ అభిమానులకు తమన్ ఏ స్థాయిలో కిక్కిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X