నా గుండెని తడి చేశావ్.. లవ్యూ మై డియర్ బ్రదర్.. తమన్ ఎమోషన్ ట్వీట్

సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతోన్న ప్రతిరోజూ పండగే చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోస్టర్స్ దగ్గర్నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటీ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. చిత్రలహరి తరువాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అంతటా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి.

వరుస ఫెయిల్యూర్స్..

వరుస ఫెయిల్యూర్స్..

ముఖ్యంగా ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఆయువుపట్టులా కనిపిస్తోంది. అయితే తమన్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్, విన్నర్, ఇంటెలిజెంట్ లాంటి సినిమాలు ఎలాంటి ఫలితాలను మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 కలిసి రాని కాంబినేషన్..

కలిసి రాని కాంబినేషన్..

అయితే సినిమాలు దారుణంగా బెడిసి కొట్టినా.. అందులో సంగీతం పర్వాలేదనిపించేలా ఉంది. ఆ మూవీస్ హిట్ కాకపోవడంతో తమన్‌కు కూడా ఆ ఎఫెక్ట్ కనిపించింది. తమన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ అంటే అదో బ్యాడ్ సెంటిమెంట్‌గా కొందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఫ్రెండ్స్‌ను ఎలా వదిలేస్తాం..

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తమన్‌తో ఉన్న అనుబంధం గురించి తెలిపాడు. కష్టాల్లో నష్టాల్లో తోడున్నాడు, తనతో కలిసి చేసిన సినిమాలన్నీ పోవడంతో, అందరూ తనను వదిలేయండని సలహా ఇచ్చారని, అయితే ఫ్రెండ్స్‌ను అలా ఎలా వదిలేస్తామని ఎమోషనల్ అయ్యాడు.

గుండెని తడి చేశావ్..

గుండెని తడి చేశావ్..

ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ తమన్ కూడా ఎమోషనల్ అయ్యాడు.. ‘ఏం చెప్పాలి ?మాట రాని మౌనం తప్ప..డబ్బు,వ్యాపారం అంటూ స్నేహానికి రంగులు మార్చే ఈ రోజుల్లో, అచ్చమైన స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపం ,నా ప్రాణం "సాయి తేజ్"..నీ కోసం ఎప్పుడైనా,ఏదైనా సిద్ధం మిత్రమా..నీ మాటల్తో నాకు మాటలు లేకుండా చేసావ్..నా గుండెని తడి చేసావ్..లవ్ యూ మై డియర్ బ్రదర్' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X