పవన్ పిక్‌ను ప్రొఫైల్‌గా.. కేక పుట్టించేలా వకీల్ సాబ్ ఫస్ట్ సింగిల్.. తమన్ హింట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌తో అదిరిపోయేలా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టగా మొదటి రోజే పవన్ కళ్యాణ్ పిక్ ఒకటి లీక్ అయింది. అది ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. అంతటి హైప్ ఉన్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా తమన్ చేసిన ట్వీట్, ఆయన ప్రొఫైల్ పిక్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ కథెంటో ఓ సారి చూద్దాం.

లీకైన పవన్ పిక్..
పింక్ రీమేక్ మూవీ షూటింగ్ సైలెంట్‌గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మొదలైంది. అయితే అంత సైలెంట్‌గా జరిగినా..మొదటి రోజే పవన్ లుక్ లీకైంది. పవన్ స్టైల్‌గా నడుస్తూ ఉన్న ఆ పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే పిక్‌ను టీషర్ట్స్ వేసి అమ్మితే క్షణాల్లో సరుకు మాయమైంది. అదీ పవన్ రేంజ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోయారు.

ఫస్ట్ సింగిల్ రాబోతోంది..
అప్‌డేట్ ఇవ్వండంటూ.. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల పెడుతున్నారు. దీంతో మూవీ యూనిట్ అర్జెంట్‌గా ఓ అప్‌డేట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ రాబోతోందని తమన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఫస్ట్ సింగిల్ రాబోతోందంటూ హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేసింది.

తాజాగా మరో ట్వీట్..
‘పవన్ కళ్యాణ్‌కు ఓ పెద్ద ఫ్యాన్‌గా.. ఫస్ట్ సింగిల్ విడుదల కోసం నేనూ ఎదురుచూడలేకపోతున్నా.. మా టీమ్ మొత్తం చాలా కష్టపడుతోంది.. ఇది మాకే కాదు ప్రతీ ఒక్కరికి ఎంత ముఖ్యమైందో నాకు తెలుసు.. పవన్ కళ్యాణ్‌ను మంచిగా చూపెట్టుందుకు, మంచి పాటలు ఇచ్చేందుకు మా శాయశక్తులా పని చేస్తామ'ని ట్వీట్ చేశాడు.
Recommended Video


ప్రొఫైల్ పిక్‌గా పవన్ ఫోటో..
చేగువేరా లుక్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను తమన్ తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. ఈ మధ్య సుద్దాల అశోక్ తేజను తమన్ కలవడం, దీంతో పాటు ఈ ప్రొఫైల్ పిక్‌ను గమనిస్తే.. ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











