22 ఏళ్ల తర్వాత హీరోగా తమన్.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పక్కన హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ కు హిట్ ఆల్బమ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరుకారం', నందమూరి బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ మూవీ 'డాకూ మహారాజ్'కూ హిట్ సాంగ్స్ ను ఇచ్చి ట్రెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తోనూ తన డ్రమ్స్ సత్తాను చూపించారు. ప్రస్తుతం ఎలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కూడా థమన్ పేరు దాటుకొని వెళ్లడం లేదు. బాలకృష్ణకు అయితే వరుసగా ఐదు చిత్రాలకు గూస్ బంప్ప్ తెప్పించే సాంగ్స్ ఇచ్చారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా తానే మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.
మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కెరీర్ ఓ రేంజ్ లో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో బిజీయేస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఏమాత్రం ఖాళీ ఉన్న ఇతర ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్, ఇతర సినిమాల్లో క్యామియో అపియరెన్స్ లాంటి చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా థమన్ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చే న్యూస్ ను రెడీ చేశారు.

తాను ఫుల్ లెన్త్ రోల్ లో హీరోగా నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తమిళంలో స్టార్ నటుడు అథర్వ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఇదియం మురళీ' చిత్రంలో థమన్ మరో హీరో పాత్రను పోషిస్తుండటం విశేషం. అయితే థమన్ 22 ఏళ్ల తర్వాత ఇలా ఫుల్ లెన్త్ రోల్ నటిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2003లో విడుదలైన ఎస్ శంకర్ 'బాయ్స్' చిత్రంలోని నాలుగు మెయిన్ లీడ్ రోల్స్ లో ఒక లీడ్ రోల్ లో నటించి మెప్పించారు. ఇక ఇన్నాళ్లకు మళ్లీ తమిళ చిత్రంతో వెండితెరపై సందడి చేయబోతున్నారు థమన్. ఈ చిత్రంలో సచిన్ అనే పాత్రలో నటిస్తున్నారు.
అయితే.. తమిళంలో థమన్ చేస్తున్న 'ఇదియం మురళీ' చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఫీమేల్ సింగర్ జోనితానే థమన్ పాత్రకు హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఈమెకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. తమిళ నటుడు అథర్వ ప్రోత్సాహంతో జోనితా సింగర్ నుంచి నటిగా ప్రమోషన్ పొందింది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2025 జూన్ లేదా జులైలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి థమనే సంగీతం అందిస్తున్నారు. ఓవైపు నటిస్తూనే మరోవైపు సంగీతం అందిస్తుండటం విశేషం. ఫిబ్రవరి 13నే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు థమన్ కూడా హీరోగా నటిస్తుండటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక థమన్ ఇప్పటి వరకు తమిళంలోని 'సిందనాయ్ సేయ్', 'అయ్యనర్', తెలుగులో 'మిస్టర్ మజ్ను', 'బేబీ జాన్' వంటి చిత్రాల్లో స్పెషల్ అపీయరెన్స్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











