Balakrishna: భగవంత్ కేసరి మూవీ వాయిదా.. థమన్ పోస్టుతో తేలిపోయిన నిజం

ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. ఈ మధ్యన మాత్రం ఏకధాటిగా విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో భీకరమైన ఫామ్‌తో సత్తా చాటుతున్నారు సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఊపులోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపకల్పనలో నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమానే 'భగవంత్ కేసరి'. విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రచార చిత్రాలతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

Thaman Gives Clarity on Bhagavanth Kesari Movie Release Postponement

'భగవంత్ కేసరి' సినిమాకు సంబంధించిన షూటింగ్ గత జనవరిలో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా.. ఇప్పుడు మాత్రం చిత్రీకరణ శరవేగంగానే సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరాకు రిలీజ్ చేయబోతున్నారు.

విభిన్నమైన స్టోరీలైన్‌తో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో బాలయ్య ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ సినిమా వర్క్ కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

Thaman Gives Clarity on Bhagavanth Kesari Movie Release Postponement

'భగవంత్ కేసరి' రిలీజ్ పోస్ట్‌పోన్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'భగవంత్ కేసరి బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలైంది. అక్టోబర్ 19 నుంచి థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నారు' అని చెప్పాడు. దీంతో సినిమా అనుకున్న తేదీకే వస్తుందని తేల్చేశాడు.

Thaman Gives Clarity on Bhagavanth Kesari Movie Release Postponement

ఇదిలా ఉండగా.. బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X