ముగ్గురు అమ్మాయిలతో ప్రభాస్ రచ్చ.. జపాన్‌ ప్లాన్ లీక్ చేసేసిన థమన్

స్టార్‌డమ్ వచ్చిన హీరోలు అందరూ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తద్వారా రెండేళ్లకో, మూడేళ్లకో ఒకసారి స్క్రీన్‌పై సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కానీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం దీనికి పూర్తి భిన్నం అనే చెప్పాలి. అంతలా అతడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తనదైన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అ నేపథ్యంలో ప్రభాస్ గురించి కొన్ని సర్‌ప్రైజింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ వాటిని లీక్ చేసింది ఎవరు? దీనిపై మీరు కూడా లుక్కేయండి మరి!

పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అలాగే, గత ఏడాది 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చి మరో హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చేస్తున్నాడు.

Thaman Gives Clarity On Prabhas Starrer The Raja Saab Movie Songs and Japan Event

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న 'ది రాజా సాబ్' సినిమా హర్రర్ కామెడీ స్టోరీతో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకుండానే షూటింగ్‌ను చిత్ర యూనిట్ సీక్రెట్‌గా మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లను జరుపుకుని చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు.

ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినప్పటికీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి అప్పుడప్పుడూ కొన్ని విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రంలోని పాటల గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని సర్‌ప్రైజ్‌లు రివీల్ చేశాడు. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఓ సాంగ్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పేశాడు.

Thaman Gives Clarity On Prabhas Starrer The Raja Saab Movie Songs and Japan Event

'ది రాజా సాబ్' చిత్రంలో ఒక డ్యూయెట్, రాజా సాబ్ వరల్డ్ థీమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్, సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో సాంగ్స్ ఉంటాయట. వీటికితోడు ఒక పాటు జపనీస్ వెర్షన్‌తో కంపోజ్ చేసినట్లు థమన్ వెల్లడించాడు. అందుకే జపాన్ దేశంలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను కూడా ప్లాన్ చేసినట్లు ముఖ్య సమాచారం బయటపెట్టాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఇక, క్రేజీ హర్రర్ స్టోరీతో రాబోతున్న 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు

More from Filmibeat

Read more about: the raja saab prabhas thaman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X