అవన్నీ రూమర్లే.. జూనియర్ దేవీ వచ్చేస్తున్నాడు.. ఒక్క ట్వీట్‌తో వాటికి చెక్ పెట్టేసిన తమన్

క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి ఇతరులతో పోటీ ఉండటం సహజం. అయితే అది వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి ఏ హాని కలిగించకుండా ఉండాలి. అప్పుడే ఇంకా పోటీ తత్త్వం పెరిగి క్రియేటివిటీకి పదును పెట్టే చాన్స్ వస్తుంది. అలా ప్రస్తుత కాలంలో ఓ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన సంగీతంతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోన్న తమన్.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

మంచి ఫామ్‌లో ఉన్న తమన్..

మంచి ఫామ్‌లో ఉన్న తమన్..

తమన్ నుంచి వచ్చే ప్రతీ పాటలో ఏదో ఒక కొత్తదనం ఉండటంతో అవి సంచలనంగా మారుతున్నాయి. ఇక అలవైకుంఠపురములో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామజవరగమన, రాములో రాముల, ఓ మై గాడ్ డ్యాడీ, బుట్టబొమ్మ పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

వెనుకబడిన దేవీ..

వెనుకబడిన దేవీ..

ఓ వైపు తమన్ అలా దూసుకుపోతుంటే.. దేవీ శ్రీ ప్రసాద్ నాసిరకమైన పాటలను ఇస్తూ విమర్శల పాలవుతున్నాడు. ప్రస్తుతం దేవీ చేతిలో ఒక్క సరిలేరు ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. కానీ తమన్ వరుసగా వెంకీమామ, ప్రతిరోజూ పండగే, డిస్కోరాజా, అల వైకుంఠపురములో వంటి చిత్రాలను చేస్తూ ఉన్న కొత్త సంగీతాన్ని అందించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. దేవీ మాత్రం అదే మూసధోరణిలో పాటలు అందించడం విమర్శలకు కారణమైంది.

ఇద్దరి మధ్యా తీవ్రమైన పోటీ..

అయితే సంగీత దర్శకులుగా వీరిద్దరి మధ్యా ఎలాంటి బేధాభిప్రాయాలు లేకున్నా.. అభిమానుల్లో మాత్రం ఉంటాయి కదా. వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిని తమన్ ఖండించాడు కూడా. సంగీత దర్శకులందరికీ వాట్సాప్ గ్రూప్‌లుంటాయని, అందులో రోజూ చర్చలు జరుగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చాడు.

తాజాగా దేవీ ట్వీట్‌కు తమన్ రిప్లై..

తాజాగా దేవీ ట్వీట్‌కు తమన్ రిప్లై..

ఒక్క సరిలేరు టైటిల్ సాంగ్ అందర్నీ మెప్పించేలా ఉండగా.. ఈ పాటను తమ అల్లుడు తనవ్ సత్య పాడటం, దాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో దేవీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌కు తమన్ రిప్లై ఇస్తూ.. జూనియర్ డీఎస్పీ తయారవుతున్నాడు.. దేవీ లవ్యూ బ్రో.. అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవని ఇరువురి అభిమానులు కాస్త చల్లబడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X