Guntur karam: మహేశ్ మూవీ నుంచి థమన్ ఔట్.. ఆ ట్వీట్‌తో టాలీవుడ్‌లో కలకలం
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు - బడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమాను అనుకన్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి మరో షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అతడిని దీని నుంచి తప్పిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, కొద్ది రోజుల క్రితం వచ్చిన గ్లింప్స్ వీడియోకు అతడు చక్కని బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో ఇదంతా పుకారే అని తేలింది. అయితే, ఇప్పుడు మరోసారి థమన్ పని తీరు మహేశ్ బాబుకు నచ్చలేదని టాక్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో తాజాగా అతడిని ఈ సినిమా నుంచి తీసేసినట్లు మరో న్యూస్ బయటకు వచ్చేసింది.

'గుంటూరు కారం' మూవీ నుంచి థమన్‌ను తీసేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అతడు చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో బటర్ మిల్క్ గ్లాస్ ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు, 'రేపటి నుంచి నా స్టూడియోలో ఉచితంగా బటర్ మిల్క్ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్నాను. కడుపు మంట లక్షణాలతో బాధ పడే వారికి స్వాగతం. దయచేసి కోలుకోండి. నా సమయాన్ని వృథా చేయకూడదని అనుకుంటున్నా. శుభరాత్రి మీకోసం శాంతి, ప్రేమ మరియు కొన్ని అరటిపళ్లు' అని ట్వీట్ చేశాడు.
థమన్ చేసిన ట్వీట్ తనను 'గుంటూరు కారం' మూవీ నుంచి తప్పించినందుకే చేశాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక, ఈ సినిమా కోసం థమన్ స్థానంలో అనిరుథ్ లేదా జీవీ ప్రకాశ్ కుమార్‌లలో ఒకరిని తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











