వకీల్ సాబ్ లుక్.. అదిరిపోయే పిక్ షేర్ చేసిన తమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. హిందీలో పింక్ అంటూ అమితాబ్, కోలీవుడ్‌లో నేర్కొండ పార్వై అంటూ అజిత్ భారీ హిట్టు కొట్టారు. ఇక తెలుగులో ఈ చిత్రం వకీల్ సాబ్‌గా రీమేక్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. మగువా మగువా అంటూ ఉమెన్స్ డేన విడుదల చేసిన ఈ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

వకీల్ సాబ్ నుంచి ఇప్పటికే ఓ ఫైట్ సీన్ లీకైంది. పవన్ కళ్యాణ్ రేంజ్‌కు సరిపోయే అదిరిపోయే డైలాగ్‌తో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో లీకైంది. ఇలా లీకులతోనే వైరల్ అయిన పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను టైటిల్‌లోనూ వాడారు. తాజాగా షూటింగ్ లొకేషన్స్ నుంచి ఓ ఫోటోను తమన్ షేర్ చేశాడు.

Thaman Shared pawan Kalyan Pic from vakeel Saab Shooting

తమన్ షేర్ చేసిన ఈ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. నిన్న జనసేన ఆవిర్బావ దినోత్సవంలో క్లీన్ షేవ్‌తో కనిపించిన పవన్ మునుపటి పవర్ స్టార్‌లా కనిపించాడు. తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ ఫోటోను షేర్ చేశాడు. ది బెస్ట్ క్లిక్ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X