For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకే కారులో మహేష్, విజయ్.. అభిమానులకు థమన్ సర్‌ప్రైజ్‌!

  |

  ఇటీవల కాలంలో అభిమానుల మధ్య యుద్ధాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు సోషల్ మీడియాలో దారుణమైన బూతులతో తిట్టుకోవడం కామన్ గా వస్తోంది. స్టార్ హీరోలు వారిని కూల్ చేసేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. రికార్డుల విషయంలోనే అభిమానుల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఒకప్పుడు థియేటర్ వద్ద ఇలాంటి గొడవలు జరిగేవి.

  కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాటలతోనే నువ్వా నేనా అనే రేంజ్ లో తిట్టుకుంటున్నారు. దారుణమైన ట్యాగ్స్ ను క్రియేట్ చేసి హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హీరోలు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఏదైనా సందర్భంలో విష్ చేసుకుంటే అభిమానుల మధ్య మాటల యుద్ధాలు కాస్త తగ్గుతున్నాయి.

  అభిమానులను టార్గెట్ చేసే థమన్

  అభిమానులను టార్గెట్ చేసే థమన్

  ఇక రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ తలపతి విజయ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. సంగీత దర్శకుడు తమన్ ఆ ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ ఫోటో మరింత వైరల్ అయ్యింది. తమన్ ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటాడు ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ అని కాకుండా ప్రతి ఒక్క స్టార్ హీరో అభిమానులను ఆకట్టుకునేలా అప్డేట్స్ ఇస్తుంటాడు. వీలయినంతవరకు కాంట్రవర్సీ లేకుండా సేఫ్ జోన్ లోనే ట్వీట్స్ వేస్తుంటాడు.

  మహేష్ సినిమాలతో విజయ్ హిట్స్

  మహేష్ సినిమాలతో విజయ్ హిట్స్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇద్దరు కూడా సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలు. మహేష్ బాబు హిట్ సినిమాలను కొన్ని విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఒక్కడు సినిమా సక్సెస్ అవ్వగానే తమిళ్ లో రీమేక్ చేసి విజయ్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి విజయ్ మార్కెట్ రేంజ్ పెరుగుతూనే వచ్చింది. అలాగే పోకిరి సినిమాను కూడా రీమేక్ చేసిన విజయ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

  మహేష్ చాలెంజ్ కు విజయ్ రెస్పాన్స్

  మహేష్ చాలెంజ్ కు విజయ్ రెస్పాన్స్

  ఈ స్టార్డ్ బయట ఎక్కువగా కలుసుకో పోయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఒకరికొకరు ట్విట్స్ తో పలకరించుకుంటారు. గతంలో మహేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం మొక్కలు నాటాలని విజయ్ కు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే విజయ్ కూడా చాలా తొందరగానే మహేష్ బాబు చేసిన ఛాలెంజ్ కు తగ్గట్టుగా తన ఇంటి పెరట్లో మొక్కలు నాటాడు. వారిద్దరి ట్వీట్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్ అత్యధిక రీట్వీట్స్ జాబితాలో కూడా నిలిచారు.

  థమన్ షేర్ చేసిన ఫొటో

  థమన్ షేర్ చేసిన ఫొటో

  ఇక రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మహేష్ బాబు కారు దిగుతుండగా విజయ్ డైవింగ్ సీట్ లో ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఒక ఫోటో థమన్ కు ఎవరు పంపించారో గాని కానీ వెంటనే తన ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ..వ్వా సూపర్ అంటూ.. ఫోటో ఇప్పుడే చూశాను అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఇరు వర్గాల అభిమానులు ఫోటో ట్రెండ్ అయ్యే విధంగా షేర్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమ ఏ రేంజ్ లో ఉంటుందో దీంతో మరోసారి అర్థమైంది.

  మహేష్... రాబోయే సినిమాలు

  మహేష్... రాబోయే సినిమాలు

  ఇక వీరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరొక యాక్షన్ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఆ సినిమాతో పాటు వీలైతే మరొక చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం అనిల్ రావిపూడి కూడా సరైన స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మరొక యాక్షన్ సినిమాను ఇదే ఏడాది చివర్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

  Ileana D’Cruz Viral Pic || మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది..!!
  విజయ్ సినిమాల విషయానికి వస్తే..

  విజయ్ సినిమాల విషయానికి వస్తే..

  ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం బీస్ట్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చివరగా వచ్చిన మాస్టర్ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో బీస్ట్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మాస్టర్ సినిమాతో వచ్చిన టాలీవుడ్ మార్కెట్ ను ఏ మాత్రం వదిలి పెట్టకూడదని విజయ్ సిద్ధమవుతున్నాడు.

  అలాగే దిల్ రాజు - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. అలాగే విజయ్ మరో సినిమాపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

  English summary
  Thaman shares Mahesh babu and vijay sarkaru vaari paata car poster viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X