తమన్ కౌంటర్.. పగలబడి నవ్విన బన్నీ, త్రివిక్రమ్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్
సంక్రాంతి బరిలోకి దిగిన రెండు సినిమాలు సూపర్ హిట్ దిశగా దూసుకువెళ్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్నాయి.. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పోరు నడుస్తూ ఉంటే.. బయట సోషల్ మీడియాలో కలెక్షన్లు, రికార్డుల పేరిట ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. ఒకరు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తుంటే.. మరొకరు దానికి మించిన పోస్టర్ వేసేస్తున్నారు. అందరూ నాన్ బాహుబలి రికార్డులేనని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాటిని ఫ్యాన్స్ పట్టించుకుంటారే తప్పా.. సగటు సినీ ప్రేక్షకుడికి వీటిపై అంత ఆసక్తి ఉండదు. అయితే ఫ్యాన్స్ మాత్రం వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తమ హీరో పేరు మీదే అన్ని రికార్డులున్నాయని చెప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

మొదట్నుంచీ వార్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురుములో విషయంలో మొదటి నుంచి పోటీ ఎదురువుతూనే వస్తోంది. పాటలు రిలీజ్ చేసే సమయం నుంచి ప్రతీ అప్‌డేట్ విషయంలోనూ అదే జరుగుతూ వచ్చింది. చివరకు విడుదల తేదీ దగ్గర కూడా పేచీ వచ్చింది. ఎలాగోలా అన్ని సద్దుమణి పోటీ లేకుండా మొదట నిశ్చయించుకున్నట్లే థియేటర్లలోకి వచ్చారు. అక్కడి వరకు అంతా బాగానే ఉందని అనుకుంటూ ఉంటే.. కలెక్షన్లు, రికార్డుల విషయంలో ఫ్యాన్స్ వార్ మొదలైంది.

నాన్ బాహుబలి రికార్డులంటూ..
ఈ రెండు చిత్రాలకు సంబంధించిన కలెక్షన్లను చెబుతూ.. నాన్ బాహుబలి రికార్డులంటూ పోస్టర్లు వేస్తూ వస్తున్నారు. వారు కొన్ని ఏరియాలు, వీరు కొన్ని ఏరియాలు పంచుకుని వేసుకుంటే ఈ కన్‌ఫ్యూజన్ వచ్చి ఉండేది కాదేమో. నాన్ బాహుబలి రికార్డులు మావి అంటే మావే అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాటల యుద్దానికి దిగుతున్నారు.

మొగుడు.. రంకు మొగుడు..
ఈ సంక్రాంతి మొగుడు అంటూ సరిలేరు నీకెవ్వరు డైలాగ్‌ను పెడుతూ మహేష్ బాబు ఫ్యాన్స్ హల్ చల్ చేస్తూ ఉంటే.. అల వైకుంఠపురములో సినిమాలో రంకు మొగుడు అంటూ సునీల్ చెప్పిన డైలాగ్‌తో బన్నీ ఫ్యాన్స్ సమాధానం చెబుతున్నారు. ఇలా ఎవరి హీరో ఫ్యాన్స్ వారికి సపోర్ట్‌గా నిలబడితే ఎలాంటి గొడవలు రావు కానీ, ఓ మ్యూజిక్ డైరెక్టర్.. అందులోనూ ఆ ఇద్దరి హీరోలతో మంచి సంబంధాలున్న తమన్ లాంటి మధ్యలో వేలు పెడితే వ్యవహారం మారిపోద్ది.

నోరు జారిన తమన్..
వైజాగ్‌లో జరిగిన అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్‌లో తమన్ మాట్లాడుతూ.. పరోక్షంగా సరిలేరుపై కౌంటర్ వేశాడు. ఈ సినిమాకు నిజంగా పని చేశాం.. నిజమైన మ్యూజిక్ అడిగింది.. నిజమైన మాటలే మాట్లాడమంది.. నిజమైన కలెక్షన్లే చెప్పమంది.. అని నోరు జారేశాడు. దీంతో వేదిక కిందున్న బన్నీ, త్రివిక్రమ్, అల్లు అరవింద్‌లు పగల బడి నవ్వేశారు. ఇవి ఇండైరెక్ట్‌గా సరిలేరు గురించే అని మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి వీటిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











