బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన థమన్: ఏకంగా ఫొటో షేర్ చేసి మరీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తన స్టామినాను తెలుగు ప్రేక్షకులకు చూపించారు. దీంతో వాళ్లందరి ఆదరణను సొంతం చేసుకున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక, కొంత కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాలయ్య.. గత ఏడాది విడుదలైన 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.
'అఖండ'తో భారీ విజయాన్ని అందుకున్న ఉత్సాహంతో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను అంతే జోష్‌తో జత చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 'క్రాక్'తో బిగ్ సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాలయ్య కోసం నిజజీవిత సంఘటనలతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే ఎంతో హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు.
గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో పాటు మరికొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్‌ను త్వరగా మొదలెట్టలేదు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి తాజాగా అతడు ట్వీట్ చేశాడు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని, రామజోగయ్య శాస్త్రి, శ్రీకృష్ణతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీనికి 'నందమూరి బాలకృష్ణ గారి సినిమా మ్యూజిక్ జర్నీ మొదలైంది. మా బావ గోపీచంద్ మలినేని మరోసారి సత్తా చాటబోతున్నాడు. మా రామజోగయ్య శాస్త్రి గారి రచన, సింగర్ శ్రీకృష్ణతో కలిసి పని చేస్తున్నా. జై బాలయ్య' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో దీనికి బాలయ్య అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











