Bheemla Nayak: పవన్ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్.. థమన్ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఖుషీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలా భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. దీంతో కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఎన్నో అంచనాలను కూడా ఏర్పరచుకుంటున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా గుర్తింపును సైతం దక్కించుకుంటున్నాయి. అలాంటి వాటిలో 'భీమ్లా నాయక్' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంది. మల్టీస్టారర్ జోనర్‌లో వచ్చిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా గణనీయంగా జరిగిన విషయం తెలిసిందే.

టాలీవుడ్‌లో బడా హీరోలుగా పేరొందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు నెల రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ హడావిడితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Thaman Tweet about Bheemla Nayak Rap Song

పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కెరీర్‌లలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి విడుదలైన రోజు నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఇది అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత నుంచి ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మొత్తంగా ఎనిమిది రోజులు పూర్తయ్యే సరికి 'భీమ్లా నాయక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 90.60 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 17.40 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ నుంచి త్వరలోనే మరో సర్‌ప్రైజ్ రాబోతుందట. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నుదిటిన వీర తిలకాన్ని దిద్దుకుని దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. దీనికి 'భీమ్లా నాయక్ కోసం మళ్లీ డ్యూటీ చేస్తున్నా. ర్యాప్ సాంగ్ వస్తోంది. సంబరాలు చేసుకోడానికి రెడీగా ఉండండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో దీని కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే భీమ్లా నాయక్ నుంచి డీజే వెర్షన్ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు. ఇక, ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలోకి విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X