For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అఖండ’ మూవీపై అంచనాలు పెంచేసిన థమన్: ఐస్‌ఫుల్ అంటూ అదిరిపోయే ట్వీట్

  |

  కొంత కాలంగా హిట్ దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కేవలం ఒకే ఒక్క ఏడాది ఏకంగా మూడు ఫ్లాపులను చవి చూశారాయన. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు. అయినప్పటికీ విజయం మాత్రం దక్కడం లేదు. దీంతో ఆయన అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలని బాలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ మూడో సినిమాను చేస్తున్నారు.

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోత

  'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించి యాక్షన్ ఎపిసోడ్‌ను సైతం పూర్తి చేసేశారు. కొంత భాగం మినహా ఈ సినిమా టాకీ పార్ట్‌ను చాలా వరకూ కంప్లీట్ చేసేశారు. ఈ నేపథ్యంలో 'అఖండ' మూవీ గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే ట్వీట్ చేశాడు.

  Thaman Tweet about Nandamuri Balakrishna Akhanda Movie

  'అఖండ' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడో వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, దీనికి సంబంధించిన క్లారిటీ మాత్రం చిత్ర యూనిట్ నుంచి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్టర్‌లో 'ఇప్పటి వరకూ మనం హౌస్‌ఫుల్ అనే పదాన్ని మాత్రమే విన్నాం. కానీ, అఖండ ఐస్‌ఫుల్‌ అండ్ హౌస్‌ఫుల్. బాలయ్య గారు, బోయపాటి గారు లవ్ యూ సార్. అఖండ మూవీలోని మొదటి పాట త్వరలోనే రాబోతుంది' అంటూ అందులో పోస్ట్ చేశాడు.

  Happy Birthday Chiranjeevi: చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

  మామూలుగానే 'అఖండ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం గురించి థమన్ చేసిన ట్వీట్‌తో అవి మరింత ఎక్కువ అయ్యాయని చెప్పొచ్చు. ఐస్‌ఫుల్ అనే పదం వాడిన అతడు.. సినిమా ఏ రేంజ్‌లో వచ్చిందో పరోక్షంగా వెల్లడించాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న థమన్.. బాలయ్య చిత్రానికి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని ఇటీవల విడుదలైన టీజర్లను బట్టి అర్థం అయింది. ఇప్పుడు అతడు చేసిన ట్వీట్ తర్వాత ఫస్ట్ సింగిల్ ఇంకే రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో పెరిగిపోయింది.

  హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని దసరాకు విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. Now Music Director Thaman Tweet About This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X