నాగచైతన్యకు వెంకీ మామ, రాంచరణ్ షాక్! బయటపెట్టిన తండేల్ దర్శకుడు!
ఇతర రాష్ట్రాల్లో పండుగలకు ఏమో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ పెద్ద సినిమా వస్తే పండుగ ఒకలా పండుగ నాడు సినిమాలు వచ్చినపుడు వాతావరణం మరో లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. అలా ఈ కొన్ని రోజుల్లోనే దసరా సినిమాలు టాలీవుడ్ దగ్గర సందడి చేసాయి. ఇక దసరా తర్వాత దీపావళి సినిమాలు బ్లాస్ట్ చేసేందుకు వస్తున్నాయి.
కాగా ఇలా ప్రతి ముఖ్య పండుగకి తెలుగు బాక్సాఫీస్ అయితే కళకళలాడాల్సిందే అని చెప్పొచ్చు. అయితే వీటి అన్నిటితో పాటుగా సిసలైన పండగ రేస్ ఒకటి ఉంది. అదే సంక్రాంతి సీజన్.. మరి సంక్రాంతి సినిమాల పోటీ అంటేనే హీట్ మాములుగా ఉండదు. ఏదొకటి చేసి పలువురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికే తీసుకురావాలని ట్రై చేస్తుంటారు.

కాగా ఈ ఏడాది సంక్రాంతి బరి కూడా అంతే రసవత్తరంగా సాగగా వచ్చే ఏడాది 2025 సంక్రాంతి రేస్ హీట్ కూడా ఇపుడు నుంచే ఉంది. అయితే ఈ రేస్ లో తమ సినిమా విసయంలో ఓ యువ దర్శకుడు అసహనం వ్యక్తం చేయడం అనేది వైరల్ గా మారింది. ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న భారీ సినిమానే "తండేల్".
ఈ సినిమాని కార్తికేయ లాంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి తెరక్కిస్తున్నాడు. అయితే గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా డిసెంబర్ 20 విడుదల అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితులు రీత్యా సినిమా సంక్రాంతికి అంటూ మార్చేశారు. కాగా ఇపుడు సంక్రాంతి రేస్ లో సినిమా విడుదలపై దర్శకుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తమ సినిమా సంక్రాంతికే రెడీ అవుతుంది అని ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

ఇది అయ్యాక క్రిస్మస్ కి తీసుకురావడం సాధ్యం కాదు సంక్రాంతికి అయితే తప్పకుండా వస్తుంది అని చెప్పాడు. సరే ఇది బాగుంది కానీ సంక్రాంతికి ఇవ్వడానికి తాను రెడీ కానీ అప్పుడు చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ ఉందని అరవింద్ గారు, తన మామ వెంకీ మామ 76వ సినిమా ఉందని నాగ చైతన్య గారు అంటే ఇక ఆ రేస్ లో తప్పుకోవాలి వేరే డేట్ లోకి వెళ్ళాలి అన్నట్టుగా చందూ మొండేటి చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో అటెన్షన్ అందుకున్నాయి.
దీనితో తన సినిమా విషయంలో మాత్రం వారి జోక్యం పట్ల దర్శకుడు ఒకింత ముబావం గానే ఉన్నాడని చెప్పక తప్పదు. కాగా ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా లైవ్ స్టోరీ తర్వాత చైతుతో కలిసి ఆమె రెండో సినిమా చేస్తుంది. దీనితో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ సారథ్యంలో సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











