చిరంజీవికి అలా.. బాలయ్యకు ఇలానా? అల్లు అరవింద్‌నే అడగండి.. బన్నీ వాసు
మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయనే విషయాల గురించి మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఈ రెండు కుటుంబాలు నర్మగర్భంగా మాట్లాడే తీరు ఆ వివాదాస్పద అంశానికి బలం చేకూరేలా కనిపిస్తుంటుంది. అయితే సాధారణ ప్రజలకు ఆ కుటుంబాల మధ్య గతంలో ఉన్న సఖ్యత, బంధాలు లేవనే అపోహ మాత్రం ఏర్పడింది. అయితే ఈ విషయాలపై రెండు కుటుంబాలకు ఆప్తుడైన తండేల్ నిర్మాత బన్నీ వాసు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో అల్లు ఫ్యామిలీకి నందమూరి బాలకృష్ణ అత్యంత చేరువైనట్టు బయట వాళ్లకే కాకుండా సినిమా వర్గాలకు అనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంపై అన్ని వర్గాల నుంచి స్పందన వ్యక్తమైంది. అయితే సినీ పరిశ్రమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఆయనకు సన్మానం చేయాలనే ఆలోచనలో సినిమా పరిశ్రమ ఉందనే వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

అయితే బన్నీ వాసును ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ వస్తే ఎలాంటి సన్మానం చేయలేదు. మెగా హీరోలు, మెగా కుటుంబం పెద్దది అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో ఉంది. ఆ సన్మాన కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సరైన రీతిలో స్పందించారు.
పద్మ భూషణ్ అవార్డు అందుకొన్నందుకు చిరంజీవికి సన్మానం చేయకపోవడం.. బాలకృష్ణకు చేయాలనే ప్లాన్ చేయడం లాంటి విషయాలను అరవింద్ గారి లాంటి పెద్ద వాళ్లను అడిగితే బాగుంటుంది. అది చాలా పెద్ద విషయం. నా వయసుకు, నా స్థాయికి మాట్లాడే విషయం కాదు. అరవింద్ గారినే అడిగితే మంచింది. ఈ పరిస్థితుల్లో నేను ఏం మాట్లాడినా బాగుండదు. ఆ విషయం గురించి నేను మాట్లాడితే కరెక్ట్ కాదు అంటూ బన్నీ వాసు తప్పించుకొన్నారు.

నంద్యాల వివాదం తర్వాత నాకు, పవన్ కల్యాణ్‌కు మధ్య గ్యాప్ వచ్చిందనే విషయం సరికాదు. అందులో వాస్తవం లేదు. పవన్ కల్యాణ్ మెచ్యురిటీ లెవెల్స్ వేరేగా ఉంటాయి. ఆయన ఇలాంటి విషయాలను మనసులో పెట్టుకోని చూడరు. ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు ఎలాంటి వారు? అనేది ఆయనకు ఫుల్లుగా క్లారిటీ ఉంది. నా విషయంలో ఆయన బన్నీతో కలిపి చూడరు.పార్టీకి ఏం చేస్తున్నాను? పార్టీ కోసం ఎలా ఉంటున్నారనేది ఆయన చూస్తారు అని బన్నీ వాసు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











