Thandel Trailer Review: నాగచైతన్య మాస్‌ అదుర్స్‌.. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్

Thandel trailer: అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్‌' (Thandel). నేషనల్ అవార్డు అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్ భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ పాన్ ఇండియా మూవీ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ (Thandel Trailer)ను నేడు విడుదల అయింది.

వాస్తవ ఘటనల ఆధారంగా దేశభక్తితో కూడిన ప్రేమకథగా తెరకెక్కింది తండేల్. ఈ మూవీని దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా విడుదల ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో హీరో నాగ చైతన్యకు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొడుతాడని అక్కినేని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలపై పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.

Thandel trailer Review Sai Pallavi Naga Chaitanya chemistry rises expectations bar at box office

తాజాగా విడుదలైన తండేల్ మూవీ ట్రైలర్‌.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. దేశభక్తితో పాటు ఎమోషన్ లవ్‌స్టోరీ వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్య మాస్ లూక్, ఉత్తరాంధ్ర యాసలో సాయి పల్లవి డైలాగ్స్ చెప్పడం అదుర్స్. అలాగే హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
మత్స్యకారుడు పాత్రలో నాగ చైతన్య జీవించేశాడు. 'తండేల్' ట్రైలర్ విషయానికి వస్తే.. సముద్ర తీరా ప్రాంతంలో ఉంటే ఓ గ్రామంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య ఓ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ నడుస్తోంది. వారి కెమిస్ట్రీకి, ఆ లవ్ ట్రాక్‌కు యూత్ ఆడియెన్స్ అట్రాక్ట్ కావాల్సిందే.

ట్రైలర్ ప్రారంభంలో మన గురించి మాట్లాడుకుంటున్నారంటే.. 'రాజు ఊళ్లో మన గురించి ఏటేటో మాట్లాడుకుంటున్నారు', 'మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఫేమస్ అయినట్టేనే..', 'నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా' అనే డైలాగ్స్ ఉత్తరాంధ్ర స్లాంగ్ లో సాయిపల్లవి, నాగ చైతన్య చెప్పడం చాలా బాగుంది. ఇక ప్రేమ కథతో పాటు దేశ భక్తిని చాటే సీన్స్ కూడా ఉన్నాయి. ఆ డైలాగ్స్ వెంటే గుస్ బంప్స్ .. అందులో 'మా దేశంలోని ఊరకుక్కలన్ని ఉత్తరం దిక్కు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తానే.లేకుండా పోతుంది'అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.

Thandel trailer Review Sai Pallavi Naga Chaitanya chemistry rises expectations bar at box office

అలాగే.. 'మా యాసని ఎటకారం చేస్తే.. రాజులమ్మ జాతరే', 'ప్రమాదమని తెలిసినా తన మంది కోసం ముందుకు అడుగు వేసేవాడే తండేల్' అనే డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. తండేల్ అంటే ఓనరా? అని అడిగితే.. కాదు సర్ లీడర్ అని .. తండేల్ టైటిల్ అర్థాన్ని ట్రైలర్ లో చెప్పేశారు. మొత్తానికి నాగ చైతన్య మాస్ లుక్స్, సాయి పల్లవి యాక్టింగ్ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. మరీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న తండేల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X