Thangalaan Trailer Review: హాలీవుడ్ స్థాయిలో విక్రమ్ పెర్ఫార్మెన్స్.. ఒళ్లు జలదరించేలా తంగలాన్ ట్రైలర్
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తంగలాన్" ట్రైలర్ రిలీజ్ చేశారు.
దర్శకుడు పా రంజిత్, విక్రమ్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..
{video1}
తంగలాన్ ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రపంచానికి దూరంగా ఉంటే గ్రామీణ ప్రాంతంలో జరిగే కథ అని మనుషులను చూస్తే స్పష్టమవుతుంది. నీ తలలో అసలు ఏం తిరుగుతుందో అర్దం కావడం లేదు. ఓ బ్రిటిష్ ప్రభువు గ్రామానికి రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక బంగారం వేట, తవ్వకాల నేపథ్యంగా కథా సాగడం అత్యంత ఇంట్రెస్టింగ్ విషయంగా కనిపిస్తుంది.
ట్రైలర్‌లో కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో ఓ మాంత్రికురాలిని కథలోకి తీసుకొచ్చి స్టోరీని మలుపు తిప్పాడు. ఇక చావును ఎదురించే వారికి ఇక్కడ జీవితం స్థానం అంటూ ఓ పోరాటానికి విక్రమ్ పిలుపు నిచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వంపై గ్రామస్థులు కలిసి కట్టుగా చేసే పోరాటం అనేది ప్రధాన పాయింట్‌గా అర్దమైంది.
తంగలాన్ ట్రైలర్ చూస్తే.. ఎప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా నట ప్రదర్శన చూపించే విక్రమ్ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించారనే విషయం అర్దమైంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనే చెప్పాలి.
నటీనటులు: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్: ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్: ఆర్కే సెల్వ
స్టంట్స్: స్టన్నర్ సామ్
బ్యానర్స్: స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: పా రంజిత్



Click it and Unblock the Notifications











