The wedding of Virosh: విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి... యంగ్ హీరోయిన్‌తో జంటగా ఆ స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులూ తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన ఈ జంట.. ఇటీవల అధికారికంగా తమ బంధాన్ని, పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని బయటపెట్టారు. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరిట తమ పెళ్లి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయని.. ఇన్నేళ్లుగా తమను ఆదరించి, అభిమానిస్తున్న అభిమానులకు విజయ్ - రష్మికలు ధన్యవాదాలు తెలియజేశారు. దాంతో ఇంతకాలంగా జరుగుతోన్న సస్పెన్స్‌కి వీరిద్దరూ తెరదించారు.
ఉదయ్‌పూర్‌లో పెళ్లి నిమిత్తం విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు రెండు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు కూడా ఉదయ్‌పూర్ చేరుకున్నారు. నగరంలోని ఆరావళి పర్వతాల మధ్య ఉన్న అందమైన ది మెమొంటోస్ బై ఐటీసీ హోటల్స్ అనే లగ్జరీ హోటల్‌లో విజయ్ - రష్మికలు ఒక్కటి కానున్నారు. మంగళవారం నుంచి వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24వ తేదీన అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకలు జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మిగిలిన ఈవెంట్స్ కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేశారు విజయ్ - రష్మిక. బుధవారం ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. అలాగే గురువారం రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయ్.

మరోవైపు.. విజయ్ దేవరకొండ - రష్మికల పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు సెలబ్రిటీలు ఉదయ్‌పూర్ నగరానికి చేరుకుంటున్నారు. ప్రముఖుల రాకతో ఉదయ్‌పూర్ విమానాశ్రయం సందడిగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం కూడా విజయ్ - రష్మికల పెళ్లిలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాష్, శ్లోకా అంబానీలు కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే తర్వాత ఇదంతా నిజం కాదని జాతీయ మీడియా తేల్చింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ క్షేత్రం.. నాథ్‌ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయాన్ని దర్శించుకోవడానికి ముఖేష్ అంబానీ కుటుంబం రాజస్థాన్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లికి టాలీవుడ్ నుంచి ఓ జంట హాజరుకానుండటం ఆసక్తిని కలిగిస్తోంది. వారు ఎవరో కాదు.. దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా. వీరిద్దరూ ఉదయ్‌పూర్‌కు వెళ్లేముందు శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ కథనాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీని గురించి మీడియా ప్రశ్నించగా ఇద్దరూ నవ్వేశారు. తరుణ్ - ఈషా రెబ్బాలు ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో కలిసి జంటగా నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు జంటగా విజయ్ - రష్మికల పెళ్లికి వెళ్తుండటంతో చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బాలతో విజయ్ దేవరకొండకి ప్రత్యేక అనుబంధం ఉంది. తనకు పెళ్లిచూపులు వంటి హిట్ అందించి కెకీర్‌లో నిలబడేలా చేశాడని తరుణ్‌పై పలుమార్లు అభిమానాన్ని చాటుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక ఈషా రెబ్బా విషయానికి వస్తే.. విజయ్- ఈషాలు తమ కెరీర్ తొలిరోజుల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో కలిసి నటించారు. నాటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అలా వీరిద్దరినీ తన వివాహానికి ఆహ్వానించాడు విజయ్. ఈ పెళ్లి తర్వాత తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు కూడా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











