హీరోయిన్‌తో డేటింగ్‌? ఓపెన్ అయిన టాలీవుడ్ డైరెక్టర్.. త్వరలోనే..

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ లవ్ స్టోరీపై ఆసక్తికర చర్చ మొదలైంది.గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమాయణం సాగుతోందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న మాటలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఇద్దరూ బహిరంగంగా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించిన తాజా మూవీ ఓం శాంతి శాంతిః ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా జనవరి 30న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లలో కనిపించడంతో, వారి మధ్య ఉన్న అనుబంధంపై మరింత ఆసక్తి నెలకొంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ, ఈ జంటపై వినిపిస్తున్న రూమార్స్ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Tharun Bhascker on Eesha Rebba Dating Rumours Om Shanti Shanti Movie Promotions Buzz

2025 అక్టోబర్ దీపావళి సమయంలో మొదలైన ఈ రూమార్స్, ఇద్దరూ కలిసి ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో మరింత బలపడ్డాయి. డిసెంబర్‌లో 2026లో వీరి వివాహం జరిగే అవకాశముందని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేశాయి. అయితే ఈ అంశంపై తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ఈషా రెబ్బా ఈ విషయంపై పూర్తిగా మౌనం పాటిస్తోంది. తాజాగా తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఈ వార్తలపై స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఓం శాంతి శాంతి శాంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఈషాను హీరోయిన్‌గా తీసుకున్నప్పటి నుంచే డేటింగ్ రూమార్స్ మొదలయ్యాయని మీడియా ప్రశ్నించగా, ఆయన పాటిస్తూ సమాధానం ఇచ్చారు. 'ఈషా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్... ఒక క్లోజ్ కంపానియన్. ఆమె నా ప్రతిదానికీ తోడుగా ఉంటుంది, అన్నింటినీ చూసుకుంటుంది. మోర్ దెన్ ఫ్రెండ్ ' అంటూ ఈషాను ప్రత్యేకంగా వర్ణించారు.

ఇక డేటింగ్ రూమార్స్ గురించి నేరుగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..'దాంట్లో చెప్పడానికి గానీ, దాచడానికి గానీ ఏమీ లేదు. కానీ దీనిపై మాట్లాడడానికి సరైన, మంచి సమయం కోసం వేచి చూస్తున్నాను. ఇది పూర్తిగా పర్సనల్ మ్యాటర్. అంతేకాదు, ఇది ఇతరులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను' అని తరుణ్ భాస్కర్ తెలిపారు. తాను ఏం చెప్పినా దాని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే ఆలోచించి మాట్లాడాలనుకుంటున్నానని కూడా స్పష్టం చేశారు. తన అభిప్రాయం ప్రకారం, వ్యక్తిగత విషయాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, అందుకే సరైన సమయం వచ్చినప్పుడే వాటిపై స్పందిస్తానని అన్నారు.

అనంతరం 'ఈ రూమార్స్ కి ఎండ్ కార్డ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారా?' అని యాంకర్ ప్రశ్నించగా.. తరుణ్ భాస్కర్ నవ్వుతూ 'త్వరలోనే' అంటూ సమాధానం ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ మాటలన్నీ వింటే.. ఈషా రెబ్బతో తన బంధం గురించి త్వరలోనే ఏదో ఒక స్పష్టత ఇవ్వబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఫ్యాన్స్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ జంటను ఆదరిస్తూ త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా, మరికొందరు తరుణ్ వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, తరుణ్-ఈషా జంట నుంచి ఏదైనా 'గుడ్ న్యూస్' వస్తుందా అన్న ఉత్కంఠ మాత్రం టాలీవుడ్‌లో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X