నాకు నువ్వు బాగా నచ్చినవ్.. యాంకర్ కు తరుణ్ భాస్కర్ ప్రపోజ్!
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తను కూడా నటుడిగా ఆయా చిత్రాల్లో మెరుస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తన సినిమాలను ప్రమోట్ చేయడమే కాకుండా ఇతర చిత్రాలకు కూడా తన వంతుగా సాయం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్ సెన్సేషన్ అనిల్ జీలా నటించిన తాజా చిత్రం మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ స్రవంతి చొక్కారపు తో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తరుణ్ భాస్కర్ సినిమాలు..
సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టడాని కంటే ముందు తరుణ్ భాస్కర్ చాలా షార్ట్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేశారు. 2008 నుంచి 2015 వరకు షార్ట్స్ ఫిల్స్మ్ తో అలరించారు. రాహుల్ రామకృష్ణతో సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీసి తెలుగు స్టేట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు, ఆ తర్వాత విశ్వక్ సేన్ తో ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, పిట్ట కథలు, ఒకే ఒక జీవితం, చివరిగా కీడా కోలా చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక నటుడిగా మహానటి, ఫలక్ నుమా దాస్, సీతా రామ్, కీడా కోలా, మంగళవారం వంటి చిత్రాలతో అలరించారు.

యాంకర్ ను అభినందిస్తూ..
తాజాగా తరుణ్ భాస్కర్ మైవిలేజ్ షో వారు నిర్మించిన మోతెవరి లవ్ స్టోరీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లారు. ఈ చిత్రంలో యూట్యూబ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ అనిల్ జీలా ప్రధాన పాత్రలో పోషించారు. జీ5 సినిమాను ఆగస్టు 8న ఓటీటీలో రిలీజ్ చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రియదర్శి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
చిన్న పల్లెటూరి నుంచి ప్రారంభమై ప్రస్తుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించే స్థాయికి వచ్చిన టీమ్ ను అభినందించారు. అనిల్ జీలా, శ్రీరామ్ శ్రీకాంత్, గంగవ్వను, మై విలేజ్ షో టీమ్ ను అభినందించారు. మున్ముందు మంచి సినిమాలు చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఈవెంట్ ను హోస్ట్ చేసిన బుల్లితెర బ్యూటీ, టీవీ యాంకర్ స్రవంతి చొక్కారపుతో ఆసక్తికరంగా మాట్లాడారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం, పెద్ద ఫ్యాన్ ను అని చెప్పడం కొసమెరుపు. తరుణ్ భాస్కర్ ఇచ్చిన కాంప్లిమెంట్ కు యాంకర్ స్రవంతి చొక్కారపు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
ఇక నెక్ట్స్ తరుణ్ భాస్కర్ ఏ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చివరిగా కీడా కోలాతో తెగ నవ్వించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మెయిన్ లీడ్ లో నటించి మెప్పించారు. మరోవైపు స్రవంతి చొక్కారపు బుల్లితెరపై టీవీ షోల్లో మెరుస్తూ సందడి చేస్తోంది. యాంకర్ గా తెలుగు టీవీ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











