ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న విజయ్, తరుణ్ భాస్కర్.. ఆ రియాక్షన్ తో దిమ్మతిరిగే షాక్
సినిమాల మీద ఆసక్తితో తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత తాను హీరోగా పరిచయం చేసిన విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా మారిన ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చిన ఆయన తాను విజయ్ దేవరకొండ, ప్రియదర్శి ఒక ఘోర ప్రమాదం నుంచి బయట పడ్డామని వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోగా కూడా
విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లిచూపులు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. తర్వాత విజయ్ దేవరకొండ చలవతో హీరోగా కూడా మారిన ఆయన సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

వైల్డ్ కార్డ్
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. అందులో భాగంగానే తనకు నాన్ వెజ్ బాగా వండటం వచ్చు అని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉంటుందా అని అడిగితే ప్రస్తుతం రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటి వాడని ఒకవేళ తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కనుక వస్తే అప్పుడు విజయ్ దేవరకొండ అనే వైల్డ్ కార్డ్ ను వాడతాను అని చెప్పుకొచ్చారు.

మాల్యా కూతురి పెళ్లికి
ఇక చదువులో తాను పెద్దగా ఆసక్తి చూపించే వాడిని కాదని బ్యాక్ బెంచర్ కావడంతో తాను కట్టిన సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజులతో ఒక బిల్డింగ్ కట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ మాల్యా కూతురి పెళ్లికి వెళ్లాను అని పేర్కొన్న ఆయన ఒక కెమెరా పట్టుకుని దీపిక పదుకొనేను ఫాలో అవమని చెప్పారని తాను అదే చేశాను అని చెప్పుకొచ్చాడు.

దేవరకొండ సడన్గా
ఇక పెళ్లి చూపులు సినిమా షూటింగ్ సమయంలో సినిమాలో విజయ్ దేవరకొండ రెస్టారెంట్ పెట్టిన ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని తరుణ్ చెప్పుకొచ్చాడు. ట్రక్కులో తాను, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి ఉన్నామని అయితే బ్రేకులు ఫెయిల్ అయి రోడ్డు మీద వెళ్తున్న సమయంలో అప్పటి దాకా భయపడిన విజయ్ దేవరకొండ సడన్గా రిలాక్స్ అయి పోయాడని, ఈలోపు దర్శి హ్యాండ్ బ్రేక్ వేయగానే అది ఊడి చేతుల్లోకి వచ్చేసిందని చెప్పుకొచ్చాడు.

షాక్
ఆ తర్వాత ట్రక్ వెళ్లి చెట్టును ఢీకొనడంతో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు బ్రతికామని ఆయన అన్నాడు. అయితే మేము బ్రతికే ఉన్నాము అనేదానికంటే అప్పటి వరకు భయపడిన విజయ్ దేవరకొండ ఎందుకు అంత రిలాక్స్ అయిపోయాడు అనే విషయం తెలుసుకోవాలని ఆత్రుత ఎక్కువైందని, అదే విషయాన్ని విజయ్ దగ్గరికి వెళ్లి అడిగితే మొదట్లో భయం వేసింది కానీ తర్వాత చనిపోతే అందరం కలిసి చనిపోతాం కదా అనిపించింది, అందుకే భయపడడం ఆపేశా అని విజయ్ దేవరకొండ చెప్పడం తనకు షాక్ లాగా అనిపించింది అని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











