‘క్వీన్’ రీమేక్ సౌత్ టీజర్స్: కాజల్ వీడియో షాకింగ్, తమన్నా అదరగొట్టింది
బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిన 'క్వీన్' పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. సౌత్‌లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వేర్వేరు హీరోయిన్లతో, వేర్వేరు టైటిల్స్‌తో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ', కన్నడలో 'బటర్ ఫ్లై', తమిళంలో 'పారిస్ పారిస్', మలయాళంలో 'జామ్ జామ్' టైటిల్‌తో విడుదల కాబోతోంది. తాజాగా ఈ నాలుగు చిత్రాలకు చెందిన టీజర్స్ విడుదల చేశారు.
దటీజ్ మహాలక్ష్మి టీజర్
క్వీన్ రీమేక్ తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
పారిస్ పారిస్
క్వీన్ రీమేక్ తమిళంలో ‘పారిస్ పారిస్' పేరుతో విడుదల కాబోతోంది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఓ సీన్ చూసి అందరూ షాకవుతున్నారు. అదేంటో మీరే ఓలుక్కేయండి.
బటర్ ఫ్లై
కన్నడలో ‘బటర్ ఫ్లై' పేరుతో క్వీన్ చిత్రం రీమేక్ అవుతుంది. పరూల్ యాదవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకుడు.
‘జామ్ జామ్'
మలయాళంల ఈ చిత్రాన్ని ‘జామ్ జామ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. మంజిమ మోహన్ హీరోయిన్. నీలకంఠ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











