Vijay Sethupathi Sandeep Kishan కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీ.. నిర్మాత, దర్శకులు ఎవరంటే!

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శక, నిర్మాత ద్వయం రాజ్ అండ్ డీకే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన టాప్ ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నట్టు ఓ వార్త మీడియాలో వినిపిస్తున్నది.

అయితే ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో సందీప్ కిషన్, అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కలిసి నటించడం విశేషంగా మారింది. ఈ వార్త క్రేజీగా మీడియా సర్కిల్స్‌తోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే త్వరలోనే అధికారికంగా ఈ వార్తను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

The Family man 2 fame Raj and DK presenting Pan India movie with Vijay Sethupathi and Sandeep Kishan

యువ దర్శకుడు భరత్ చౌదరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రంజింత్ జేల్కోడి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి రాజ్ అండ్ డీకే సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని టాప్, అత్యున్నత సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది.

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో మాస్, స్టైలిష్, యాక్షన్ సినిమాను రూపొందించేందుకు కథను రెడీ చేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అతి తొందర్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

విజయ్ సేతుపతి కెరీర్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో ఎవరూ చేయని విధంగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఉప్పెన, కుట్టి స్టోరి, మాస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తుగ్లక్ దర్బార్, ఇదం పొరుల్ యేవల్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. 19(1) (a), కడైసీ వివసాయి, లాభం, యాదుమ్ ఓరే యెవరమ్ కెలీర్, ముగిజ్, కాథు వాకులా రెండు కాదల్, కరోనా కుమార్, విదుతాలై, అన్నాబెల్లే సుబ్రమణ్యం, విక్రమ్, గాంధీ టాక్స్, ఇది పొరుల్ యేవల్, ముంబైకర్, వీజేఎస్ 45 చిత్రాల్లో నటిస్తున్నారు.

విజయ్ సేతుపతి, సందీప్ కిషన్ ఇద్దరూ దక్షిణాదిలో మంచి గుర్తింపు పొందారు. నరకాసురుడు, మాయావన్ చిత్రాలతో దక్షిణాదిలో పాపులారిటీని సందీప్ కిషన్ సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం నిర్మాతగా ఆయన నటించి రూపొందించిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ఇటీవల విడుదలైంది. గల్లీరౌడీ, నరకాసురన్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. కసాడ థాపారా, వివాహ భోజనంబు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X