twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Family Man 2: వివాదాలపై నోరు విప్పిన సమంత అక్కినేని.. అలాంటివి చూసి షాకయ్యా

    |

    తెలుగులోనే కాక సౌత్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే తమిళమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో ఆమె ఒక ఉగ్రవాదిగా మారుతుంది కూడా. ముందు నుంచి ఆమె లుక్, లాంగ్వేజ్ వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచాయి. ఇక ఈ విషయం మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగినా స్పందించని ఆమె ఎట్టకేలకు స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

    తమిళుల వివాదం

    తమిళుల వివాదం

    సమంత పోషించిన రాజీ పాత్ర విషయంలో తమిళ సినీ వర్గాల వారితో పాటు సామన్య జనం కూడా ఆ విషయంలో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వం అయితే ఏకంగా కేంద్రానికి లేఖ రాసింది. కొందరు సిరీస్ మొత్తాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంటే మరి కొందరు సమంత పాత్రను పూర్తిగా తొలగించాల్సిందే అన్నట్లుగా డిమాండ్ చేశారు.

    ఎట్టకేలకు

    ఎట్టకేలకు

    అయితే ఈ విషయం మీద ఎంత చర్చ జరిగినా స్పందించని సమంతా ఎట్టకేలకు స్పందించింది. ఈ సిరీస్ కి సంబంధించి వస్తున్న అన్ని రివ్యూలు, కామెంట్స్ చదవడంతో తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పుకొచ్చింది. తన జీవితంలో రాజీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

    డాక్యుమెంటరీలు చూసి

    డాక్యుమెంటరీలు చూసి

    ఆ పాత్ర చేయడానికి రాజ్ అండ్ డీకే నన్ను సంప్రదించినప్పుడు, రాజీ పాత్ర పోషించడానికి సున్నితత్వం మరియు సమతుల్యత అవసరమని నాకు తెలుసని ఆమె అన్నారు. క్రియేటివ్ టీం ఈలం యుద్ధంలో పాల్గొన్న మహిళల కథలు కలిగి ఉన్న తమిళ పోరాటం డాక్యుమెంటరీలు చూపించిందని ఆమె పేర్కొంది.

    భయపడ్డాను

    భయపడ్డాను

    తాను ఆ డాక్యుమెంటరీలు చూసినప్పుడు, ఈలం యొక్క తమిళులు కొన్ని సంవత్సరాల పాటు పడిన ఇబ్బందులు, బయటకు చెప్పుకోలేని భయం చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీలకి కొన్ని వేల వ్యూస్ మాత్రమే ఉన్నాయని నేను గమనించాను, అంటే ఈలం ప్రజల పదివేల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రపంచం వారిని పట్టించుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.

     వారికి నివాళి

    వారికి నివాళి

    లక్షల మంది తమ జీవనోపాధిని, ఇళ్లను కోల్పోయారని, లెక్కలేనన్ని మంది పౌర కలహాల గాయాలతో వారి గుండెలు పగిలి సుదూర దేశాలలో నివసిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. రాజీ కథ, నాకు కల్పితమైనప్పటికీ, ఆ అసమాన యుద్ధం కారణంగా మరణించిన వారికి, మరియు యుద్ధం యొక్క బాధాకరమైన జ్ఞాపకార్థం జీవించే వారికి నివాళి అని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu

    రాజీ పాత్ర మేల్కొలుపుతుంది


    రాజీ కథ మనకు మునుపెన్నడూ లేనంతగా, విద్వేషం, అణచివేత మరియు దురాశతో పోరాడటానికి మనుషులుగా కలిసి రావాలని చెబుతుందని అన్నారు. అలా చేయడంలో విఫలమైతే, లెక్కలేనంత మందికి వారి గుర్తింపు, స్వేచ్ఛ మరియు వారి స్వయం నిర్ణయాధికారం నిరాకరించబడతాయని, ఈ పాత్ర ఒక రోల్ మోడల్ లాంటిది అని ఆమె చెప్పుకొచ్చింది.

    English summary
    Finally samantha ruth prabhu responds on Family Man 2 issue. she shares her views about tamil ealam movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X