Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
The Family Man 2 ఆన్లైన్లో లీక్.. ప్రీ డౌన్లోడ్ ఆఫన్స్తో పైరసీ వెబ్సైట్ల దెబ్బ!
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సిరీస్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరిస్ రిలీజ్ అయిందో లేదో పైరసీ వెబ్సైట్లు కాచుకొని కూర్చొన్నాయి. ఈ సిరీస్‌ను పైరసీకి పాల్పడి దెబ్బ తీశారు.
సమంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత అక్కినేని స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈ సిరీస్‌లో సమంత తమిళ టెర్రరిస్టుగా నటించింది. అయితే తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ట్రైలర్ ఉన్నదంటూ తమిళ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షేమ్ ఆన్ సమంత అంటూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదంపై సమంత పెద్దగా స్పందించకుండా మౌనంగా ఉంది.
విమర్శలపై ధీటుగా స్పందించిన టీమ్
అయితే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌పై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డీకే ఘాటుగా స్పందించారు. తమిళ ప్రజలను కించపరిచే విధంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించలేదు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనలో తమిళ టెక్నీషియన్స్, నటీనటులు నటించారు. వారికి తమిళ సంస్కృతిపై వారికి ఆరాధనాభావం ఉంది. కాబట్టి మేము ఎవరి మనోభావాలనకు భంగం కలిగించలేదు అంటూ రాజ్ అండ్ డీకే తెలిపారు.
జూన్ 4వ తేదీన రిలీజ్
ది ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ అయ్యేదాక ఓపిక పట్టండి. వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఏదైనా స్పందించడం. మేము అందరి మనోభావాలను గౌరవించే మేము ఈ కథను సరైన రీతిలో రూపొందించాం. జూన్ 4న తేదీన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రియాక్ట్ అవ్వండి అంటూ వివరించారు.
పలు పైరసీ వెబ్ సైట్లలో
ఇదిలా ఉండగా, ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ను తమిళ్ రాకర్స్, తమిళ్ బాస్టర్స్, మూవీ రూల్జ్, తమిళ్ బ్లాస్టర్స్, టొరెంట్స్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పైరసీకి పాల్పడ్డాయి. ఫ్రీ డౌన్లోడ్ ఆప్ఫన్తో పైరసీకి పాల్పడ్డాయి. దాంతో చిత్ర యూనిట్ నివ్వెరపాటుకు గురైంది. రిలీజైన కొద్ది సేపట్లోనే పైరసీ సైట్లు ఈ మూవీ కంటెంట్‌పై దాడి చేశాయి.