The Family Man 3 : శవమై తేలిన ది ఫ్యామిలీ మ్యాన్ నటుడు .. జలపాతం వద్ద కిరాతకంగా
కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. కామెడీ, యాక్షన్ , దేశభక్తి ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. మనోజ్ భాజ్‌పాయ్ , ప్రియమణి, సమంత వంటి వారికి మంచి పేరు తీసుకొచ్చింది. రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
2019 సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ రిలీజై ఒక ఊపు ఊపింది. దానికి సీక్వెల్‌గా 2021 జూన్ 4న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూయర్‌షిప్ అందుకుంది. తొలి సీజన్‌లో భారత్‌పై తీవ్రవాదుల కుట్ర, విధ్వంసానికి చేసే ఎత్తుగడలను ఎదుర్కోవడం చూపించారు. రెండో సీజన్‌లో తమిళ టైగర్స్‌పై స్పెషల్ ఆపరేషన్ వంటి ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లడంతో పాటు కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమంతకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఊరట కలిగించింది.

సెకండ్ సీజన్‌లో సమంత ఎంట్రీతో ఈ సీరిస్‌కు సౌత్‌లోనూ మంచి ఆదరణ దక్కింది. రెండు సీజన్‌లు విజయవంతం కావడంతో మూడో సీజన్‌ను కూడా పట్టాలెక్కించింది యూనిట్. ఈసారి మేకర్స్ ఎలాంటి ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సీజన్ - 3లో కోవిడ్ 19, ఈశాన్య రాష్ట్రాలపై చైనా కుట్రల చుట్టూ కథ తిరుగుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
రాజ్ అండ్ డీకే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనోజ్ బాజ్‌పాయ్ ఆకట్టుకున్నారు. ఆయన సతీమణిగా ప్రియమణి నటించగా.. షరీబ్ హష్మీ , శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, వేదాంత్ సిన్హాలు కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ క్రేజీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్.
కాగా.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -3లో కీలకపాత్ర పోషించిన రోహిత్ బస్ఫోర్ అనే నటుడు అనుమానాస్పద స్థితిలో శవమై తేలడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అస్సాంలోని ఓ వాటర్ ఫాల్స్ వద్ద రోహిత్ మృతదేహం కనిపించింది. విహారయాత్ర నిమిత్తం రోహిత్ తన మిత్రులతో కలిసి గర్భంగా అటవీ ప్రాంతంలోని జలపాతం వద్దకు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోహిత్ మృతదేహాన్ని గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు . ఇందులో అతని తల, ముఖం తదితర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది. అయితే రోహిత్‌ను తెలిసినవారే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్‌లతో రోహిత్ గొడవ పడ్డారని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు.
హత్య వెనుక వారి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమర్‌దీప్ అనే వ్యక్తి పిలవడంతోనే రోహిత్ బయటికి వెళ్లాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే తను నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ రిలీజ్ కాకుండా రోహిత్ చనిపోవడంతో అతని అభిమానులు, సన్నిహితులు విలపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











