The Family Man Twitter Review రౌడీస్టార్ ఎంట్రీ అదుర్స్.. విజయ్ దేవరకొండకు బ్లాక్ బస్టర్!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం కాంబినేషన్‌లో పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ థాకూర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీమియర్ షో తర్వాత నెటిజన్ల కామెంట్ల వివరాల్లోకి వెళితే..
గత 4 నెలల తర్వాత మంచి తెలుగు సినిమా చూశాం. నవ్వుల్లో మునిగి సినిమాను ఎంజాయ్ చేశాం. ఫస్టాఫ్ కన్విన్సింగ్ ఉంటుంది. సెకండాఫ్ సూపర్బ్‌గా ఉంది. కానీ యావరేజ్ మూవీ. మృణాల్ బాగుంది. విజయ్ దేవరకొండ ఇంకా ఇంతకంటే బెటర్ చేయడానికి అవకాశం ఉన్న సినిమా అని నెటిజన్ కామెంట్ చేశాడు.
అమెరికాలో ప్రీమియర్ షో చూస్తున్న అభిమాని.. విజయ్ దేవరకొండ ఎంట్రీకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాలీవుడ్ ప్రిన్స్ అంటూ కామెంట్ చేశాడు. రౌడీ స్టార్ ఎంట్రీ అదిరిపోయింది అంటూ నెటిజన్ తన ఆనందాన్ని పంచుకొన్నారు.
ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్టాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. సెకండాఫ్ బోరింగ్‌గా ఉంది. బీజీఎం బాగాలేకపోవడమే కాకుండా నిరాశపరిచింది. పాటలు బాగున్నాయి అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించాడు.
ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు బాగున్నాయి. కామెడీ కూడా వర్కవుట్ అయింది. ఇంటర్వెల్ ఓకేలా ఉంది. ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ మాదిరిగానే రొటీన్‌గా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అక్కడక్కడా వర్క్ అయ్యాయి. సెకండాఫ్ కూడా యావరేజ్ అయింది. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ కోసం వేయిట్ చేయాల్సిందే.
ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్‌కు గుడ్ సెటప్ వేశారు. విజయ్ దేవరకొండ, మృణాళ్ కాంబినేషన్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జెమినీ టెలివిజన్‌లో రాధిక నిర్మించే సీరియల్‌లా ఫ్యామిలీ స్టార్ ఉంది. విజయ్ దేవరకొండ, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది. సినిమా మొత్తానికి బాగాలేదు. ఎడిటింగ్ చెత్తగా ఉంది. నిర్మాత డబ్బుతో అమెరికాలో హాలీడే చేయడానికి దర్శకుడు చేసిన ప్రయత్నంలా ఉంది. కష్టాలు, కన్నీళ్లతో సాగే ఈ సినిమాను చూడకుండా వదలేయండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫిల్మ్ స్టార్ అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొంటున్నది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు 1.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ బ్లాక్ బస్టర్‌గా మార్చబోతున్నది. మార్నింగ్ షో టాక్ పాజిటివ్ ఉంటే.. ఈ మూవీ రెండు రోజులపాటు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 45 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు.
సినీ పరిశ్రమలో అనామకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తమ ఫ్యామిలీ స్టేటస్‌ను మార్చేసిన స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఎప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. అతడిని ఎవరూ ఆపలేరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఇన్‌సైడ్ రిపోర్టును నెటిజన్ బయటకు లీక్ చేశారు. విజయ్ దేవరకొండకు బ్లాక్ బస్టర్ హిట్. ఆయన ఖాతాలో భారీ హిట్ పడబోతున్నది. రౌడీ బాయ్‌కు క్లాసీ కమ్ బ్యాక్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











