14 దేశాల్లో విడుదలైన ది ఫాగ్.. అమెజాన్‌లో ఆకట్టుకొంటున్న కాన్సెప్ట్ మూవీ
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల కంటే చిన్న సినిమాల హవా జోరుగా కనిపిస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత సృజనాత్మకతతో కూడిన విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకొంటున్నాయి. అదే కోవలో వస్తున్న విభిన్న కథా చిత్రం ది ఫాగ్. వర్శి మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుదన్ దర్శకత్వంలో గోవర్ధన్ రెడ్డి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు. విరాట్ చంద్ర, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఫేమ్ చందన కొప్పిశెట్టి, హరిణి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 14 దేశాలలో ఫిబ్రవరి 5వ తేదీన విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది.
ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ... మేము విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మా సినిమాను 14 దేశాలలో విడుదల చేశాం. అలాగే తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరోయిన్ చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీలో నా ఫర్‌ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది. కొద్ది రోజల క్రితం మా సినిమా నెట్‌ఫ్లిక్‌లో విడుదల కాగా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోల రిలీజైంది. ఈ చిత్రంలో నా ఫెర్ఫార్మెన్స్ చూసి ఆదరించాలని, ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరుకొంటున్నాను అని అన్నారు.
నటీనటులు: విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి, అజయ్ గోష్, నందు, సుప్రియ, ప్రణీత, ప్రమోద్
ఎడిటింగ్, దర్శకత్వం: సుదన్
బ్యానర్: వర్శి మోషన్ పిక్చర్స్
నిర్మాత: గోవర్ధన్ రెడ్డి
కెమెరామెన్: హరినాథ్. సతీష్ రెడ్డి
మ్యూజిక్: విజయ్ కోరాకుల, విశ్వ
పిఆర్వో: మధు వి ఆర్


Click it and Unblock the Notifications











