ఆడుజీవితం, టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్.. థియేటర్ల వద్ద దేని హవా ఎక్కువంటే?

మార్చి నెల చివరాకర్లో వచ్చిన ఏప్రిల్ నెలలో రాబోతున్న పలు సినిమాలపై సినీ ప్రియులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మార్చి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5 సినిమాలు.. ది గోట్ లైఫ్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, టిల్లు స్క్వేర్, క్రూ, మంజుమ్మల్ బాయ్స్ విడుదల కాగా.. రేపు మరో సినిమా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫ్యామిలీ స్టార్ రాబోతుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలపై అందరిలోనూ అంచనాలు ఎక్కువగానే ఉండగా.. ఫ్యామిలీ స్టార్ ను చూసేందుకు కూడా చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు.

తమ అభిమాన హీరో, లేకపోతే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే ఏప్రిల్ 3వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 4వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

The Goat Life Movie Sold The Most Tickets in April 2024 Cinemas And List is Here Check Details

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమాపై అనేక మంది ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు గడిచిన 24 గంటల్లోనే 106.21కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే లక్షా 6 వేల 210 మంది ఆడుజీవితం సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా ఈ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టికెట్ల అమ్మకాలతో టాప్ 1లో నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా నిలిచింది.

ఈ సినిమాను చూసేందుకు 58.04కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 58 వేల 40 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూడనున్నారు. ఇలా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ టాప్ 2లో నిలవగా.. టిల్లు స్క్వేర్ సినిమా టాప్ 3లో నిలిచింది. ఈ సినిమా చూసేందుకు గడిచిన 24 గంటల్లో మొత్తం 52.26కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 52 వేల 260 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశలో పయనిస్తోంది.

The Goat Life Movie Sold The Most Tickets in April 2024 Cinemas And List is Here Check Details

ఇక ఆ తర్వాత క్రూ సినిమా నిలిచింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 51.24కే టికెట్లు బుక్ కాగా... 21 వేల 210 మంది ఈ సినిమాను చూడనున్నారు. ఇక చివరకగా మంజుమ్మల్ బాయ్స్ నిలిచింది. 6.92కే టికెట్లు బుక్ అయ్యాయి. ఒక్క తెలుగులో మాత్రమే ఈ సినిమాను చూసేందుకు 6 వేల 920 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక రేపు విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు ప్రీ సేల్స్ నడుస్తున్నాయి. ఇప్పటికీ టికెట్లు బుకింగ్ స్టార్ట్ కాగా.. 25.22కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 25 వేల 220 మంది ఈ సినిమా చూసేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X