The Paradise Release Date: ‘ది ప్యారడైజ్' విడుదలకు సిద్దం.. నాని విధ్వంసానికి డేట్ ఫిక్స్!
The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని(Nani)హీరోగా, స్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'(The Paradise). ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా మూవీ భారీ విజయం సాధించడంతో, మరోసారి ఈ జోడీ కలిసి చేస్తున్న సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ నాని ది ప్యారడైజ్ మూవీ విడుదల ఎప్పుడంటే?
తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం.. ది ప్యారడైజ్ సినిమాను ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు జడలు, వాటి చివర రక్తం కారుతున్నట్లుగా డిజైన్ చేసిన ఆ పోస్టర్... ఈసారి నాని మరింత రా అండ్ రస్టిక్, ఊరమాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని స్పష్టంగా చెప్పేస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో 'ది ప్యారడైజ్' నాని కెరీర్‌లోనే అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

వాస్తవానికి ది ప్యారడైజ్ సినిమాను మార్చి చివర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువ సమయం పట్టడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఆగస్టు డేట్‌ను లాక్ చేశారు. ప్రస్తుతం సినిమా కీలక షెడ్యూల్స్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ,అదే స్థాయితో వర్డల్ వైడ్ గా విడుదల కానున్నది.
కథ పరంగా చూస్తే... 'ది ప్యారడైజ్' తల్లి-కొడుకు సెంటిమెంట్‌తో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో నాని మాస్ లీడ్ రోల్‌లో, గ్యాంగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా కయాదు లోహార్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ భారీ యాక్షన్ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
'దసరా'తో మాస్ ఇమేజ్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్లిన నాని, ఇప్పుడు 'ది ప్యారడైజ్'తో పాన్ ఇండియా స్థాయిలో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం... ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా నాని కెరీర్‌లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ మూవీ భారీ హిట్ అయితే నాని టైర్-1 హీరోల లీగ్‌లోకి ఎంటర్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











