ఆసక్తి రేపుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పివోట్ (టీజర్)

Recommended Video

ఆసక్తి రేపుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పివోట్ (టీజర్)

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం 'అమర్ అక్భర్ ఆంటోనీ'. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా శ్రీను వైట్ల పుట్టినరోజును పురస్కరించుకుని 'అమర్ అక్బర్ ఆంటోనీ' పివోట్ విడుదల చేశారు. దీన్ని టీజర్ అని చెప్పలేం కానీ.... జస్ట్ రవితేజ మూడు పాత్రలను ఫోకస్ చేస్తూ విభిన్నమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో 30 నిమిషాల నిడివిగల ఈ వీడియో బైట్ విడుదల చేశారు.

ఈ మూవీలో కీలక పాత్రల్లో ఒకప్పటి హీరోయిన్ లయ, సునీల్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కనిపించబోతున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన 'మైత్రి మూవీ మేకర్స్' నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

 The Pivot of AAA released

ఈ చిత్రంలో రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, రఘు బాబు, అభిమన్యు సింగ్, ఆదిత్య మీనన్, విక్రమ్ జిత్, రాజ్ వీర్ సింగ్, షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్ నటిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీను వైట్ల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి, సహ నిర్మాత: ప్రవీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, సినిమాటోగ్రీఫీ: విజయ్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ థమన్, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X