The Raja Saab: ఆ సెంటిమెంట్‌ని ప్రభాస్ బ్రేక్ చేశారా? రాజాసాబ్ పరిస్థితేంటీ?
The Raja Saab: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి కొత్తవి కావు. హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు... ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాను నమ్ముతారు. అదే ఒకసారి నెగిటివ్ ఫలితం వస్తే, ఆ దారి వైపు అసలు చూడటానికే భయపడతారు. ఇప్పుడు ఓ విషయం బలమైన సెంటిమెంట్‌గా మారింది. అదే సంక్రాంతికి ముందుగా విడుదలయ్యే తొలి సినిమా. నిజంగానే ఈ విషయం టాలీవుడ్‌కు శాపంగా మారిందా? తాజాగా సంకాంత్రి బరిలో ఫస్ట్ విడుదలైన ప్రభాస్ ది రాజాసాబ్ (The Raja Saab) సినిమా పరిస్థితేంటీ?
గత పదేండ్లుగా పరిశీలిస్తే సంక్రాంతికి ముందుగా వచ్చిన సినిమాల్లో హిట్స్ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. 2014లో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన '1 నేనొక్కడినే' భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది. ఇక 2015లో విక్టరీ వెంకటేష్ (Venkatesh)- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో వచ్చిన 'గోపాల గోపాల'కి పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇక 2018లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి'అయితే సంక్రాంతి తొలి సినిమా సెంటిమెంట్‌ను పూర్తిగా నెగిటివ్‌గా మార్చేసింది. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా, లాంగ్ రన్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఇక ఆ తర్వాత 2019లో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ'లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక 2020లో మాత్రం మహేశ్ బాబు ' సరిలేరు నీకెవ్వరూ' మూవీ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. కానీ, 2024 సంక్రాంతికి వచ్చిన మహేశ్ బాబు 'గుంటూరు కారం' మిక్స్‌డ్ టాక్‌తోనే ఆగిపోయింది. ఇక గతేడాది కూడా ఇదే ఫలితం కనిపించింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)నటించిన గేమ్ ఛేంజర్ ఆ సాహసం చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఫలితం ఇవ్వలేకపోయింది. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టార్ గా మారింది.
రాజా సాబ్ పరిస్థితేంటీ?
ఇక 2026 సంక్రాంతికి భారీ అంచనాలతో ప్రభాస్ 'ది రాజాసాబ్' సంక్రాంతి తొలి సినిమాగా బరిలో నిలిచింది. హారర్-కామెడీ జానర్‌లో కొత్తగా ప్రయత్నించిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.ముఖ్యంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవనే సమాచారం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. డిస్టిబ్యూటర్స్ కూడా నష్టపోయినట్టు ఓపెన్ గా చెప్పేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ది రాజాసాబ్ సినిమా గురువారం ప్రీమియర్స్‌తోనే సినిమా రూ. 9.15 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తొలి శుక్రవారం (Day 1)రూ. 54.15 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ. రూ. 47.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు రూ.60 కోట్లు దాటినట్లు సమాచారం. క్రిటిక్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, ఈ స్థాయి ఓపెనింగ్ రావడానికి ప్రభాస్ స్టార్ పవర్ వల్లే సాధ్యమైందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. కల్కి 2898 ఏడీ, సలార్ స్థాయిలో కాకపోయినా, అడ్వాన్స్ బుకింగ్స్ సినిమాకు ప్లస్‌గా మారింది.
సెంటిమెంటా? లేక కంటెంటా?
ఇలా వరుసగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఇప్పుడు ప్రభాస్ సినిమా... సంక్రాంతి తొలి రిలీజ్‌గా వచ్చి మిక్స్‌డ్ లేదా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఒకే చర్చ నడుస్తోంది. 'ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ కూడా ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయలేకపోతే, ఇక సాధారణ హీరోల పరిస్థితి ఏంటి?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే సినీ వర్గాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
'పండుగ సీజన్ కాదు, కంటెంటే ఫైనల్ జడ్జ్'. స్ట్రాంగ్ స్టోరీ ఉంటే సమయంలో వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అయితే.. రాజా సాబ్ కి భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కొంత పికప్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. కానీ ఓపెనింగ్‌లో ఎదురైన నష్టాన్ని ఎంతవరకు కవర్ చేస్తుందన్నది ఇంకా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











