The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మారుతి.. రాజా సాబ్ నుంచి ఆ సీన్స్ అవుట్!
Prabhas Raja Saab deleted scenes: సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab). భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ గురువారం అర్ధరాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ఇక శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ హారర్-ఫాంటసీ-కామెడీ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ (Prabhas)ను లైట్, ప్లేఫుల్ అవతార్‌లో చూపించిన ఈ సినిమాకు మారుతి (Maruthi) దర్శకత్వం వహించారు.
రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్లు, మోషన్ పోస్టర్లతో సినిమాపై హైప్స్ క్రియేట్ చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని ప్రశంసిస్తే, మరికొందరు మాత్రం ప్రమోషన్లలో చూపించిన కొన్ని కీలక సీన్స్ ఫైనల్ కట్‌లో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కట్ చేసిన సీన్స్ ఏంటీ? ఎందుకు కట్ చేశారు? అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

ప్రమోషన్లలో హైలైట్... సినిమాలో మిస్సింగ్!
ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్.. ప్రమోషన్ పోస్టర్‌లో సింహాసనంపై కూర్చుని, నోట్లో సిగార్‌తో రాయల్‌గా కనిపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పించింది. ట్రైలర్లలోనూ అదే లుక్‌ను హైలైట్ చేయడంతో అది కథలో కీలకమని ఫ్యాన్స్ భావించారు. కానీ, థియేటర్లలో ఆ సీన్స్ కనిపించకపోవడంతో 'ఆ సీన్స్ ఏవీ 'రాజాసాబ్'?' అంటూ డైరెక్టర్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఎక్స్‌ట్రా ఫుటేజ్‌పై నిర్మాత క్లారిటీ
ఈ విమర్శల నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి రన్ సమయంలో సినిమాకు సుమారు ఐదు నిమిషాల అదనపు ఫుటేజ్ ను యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ ఎక్స్‌ట్రా సీన్స్‌లోనే మిస్సింగ్ ఓల్డ్ మ్యాన్ లుక్ ఉంటుందేమోనన్న అంచనాలు పెరిగాయి. అయితే ఆ ఫుటేజ్‌ను ఎప్పుడు, ఎలా చేర్చాలన్నది ప్రొడక్షన్ హౌస్ నిర్ణయంపై ఆధారపడి ఉందని సమాచారం.
సీక్వెల్ హింట్ - 'రాజాసాబ్ సర్కస్ 1935'
క్లైమాక్స్‌లో డైరెక్టర్ మారుతి ఇచ్చిన సీక్వెల్ హింట్ అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనే టైటిల్‌తో పార్ట్-2 ఉంటుందని అఫీషియల్‌గా సంకేతాలు ఇచ్చారు. రిలీజ్ ట్రైలర్‌లో కనిపించిన జోకర్ లుక్‌ను సీక్వెల్‌కు లింక్ చేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఓల్డ్ మ్యాన్ గెటప్‌ను కావాలనే దాచారా? లేక ఎడిటింగ్‌లో తొలగించారా? అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.
మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలైన 'ది రాజాసాబ్' మిక్స్‌డ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. పండుగ సెలవులు కావడంతో కలెక్షన్లపై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. చెప్పినట్లుగా ఎక్స్‌ట్రా ఫుటేజ్ యాడ్ అయితే.. అభిమానులు మళ్లీ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌ను ఎప్పుడు, ఏ రూపంలో చూపిస్తారన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీకెండ్ ట్రెండ్,మౌట్ టాక్ ప్రభావంతో 'రాజాసాబ్' కలెక్షన్స్ ఆధారపడ్డాయి. ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











