The Rajasaab: ప్రభాస్ రాజాసాబ్ పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు ఊహించని విధంగా వార్నింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లెటేస్ట్ మూవీ ది రాజాసాబ్ (The Raja Saab). ఈ భారీ బడ్జెట్ మూవీ ఎన్నో అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ మారుతి ఈ మూవీని హార్రర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. విడుదలకు ముందుకు ఎన్నో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మొదటి రోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే సినిమా కథ, విజువల్ టోన్, హారర్ సెటప్ పరంగా బాలీవుడ్‌లో భూల్ భులయ్యా ( Bhool Bhulaiyaa)ను తలపిస్తోందన్న చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఫారెన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఈ వివాదాలపై మూవీ యూనిట్ వెంటనే స్పందించింది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad)మాట్లాడుతూ..'ది రాజా సాబ్'ను పూర్తిగా ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఒక కొత్త ఫాంటసీ ప్రపంచంలో రూపొందించామని తెలిపారు. కథా నేపథ్యం నుంచి విజువల్ డిజైన్ వరకూ ప్రత్యేకంగా ప్లాన్ చేశామని, ఇతర సినిమాలతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు.

The Raja Saab Copy Controversy

ఇదే అంశంపై హీరోయిన్ రిద్ది కుమార్ (Riddhi Kumar) స్పందిస్తూ... 'భూల్ భులయ్యా' తనకు ఇష్టమైన సినిమానే అయినప్పటికీ, అది పూర్తిగా రియలిస్టిక్ ప్రపంచంలో సాగుతుందని చెప్పారు. నిజ జీవితంలో జరిగే కథను చూపిస్తే, 'ది రాజా సాబ్' మాత్రం ఫాంటసీ టచ్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని వివరించారు. ఇందులో సైకాలజికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కథ మొత్తం కల్పిత ప్రపంచానికి చెందినదని ఆమె స్పష్టం చేశారు.

'నాచే నాచే' పాటపై కాపీ ఆరోపణలు
ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S)కంపోజ్ చేసిన 'నాచే నాచే' పాటపై కాపీ ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటలో ప్రభాస్, హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కలిసి వేసిన స్టెప్పులు, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ట్యూన్ మాత్రం ఒరిజినల్ కాదన్న విమర్శలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

ఈ తరుణంలో స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజిన్ (Vidojean)తన ఒరిజినల్ సాంగ్ 'అలమియో' (Alameyo)ను ముందుగా ప్లే చేసి, వెంటనే 'నాచే నాచే' పాటను వినిపిస్తూ వీడియో విడుదల చేశారు. రెండు ట్యూన్స్ "మక్కీకి మక్కీ"గా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... చెప్పు తీసి చూపిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం ఆ వీడియోలో కనిపించింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరో వీడియోలో విడోజీన్ ఒకవైపు తమన్‌పై కాపీ ఆరోపణలు చేస్తూనే.. మరోవైపు ప్రభాస్‌ను మాత్రం ప్రశంసించారు. ఈ పాట విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఎలాంటి తప్పు లేదు. ఆయన గొప్ప యాక్టర్'అంటూ కొనియాడారు. దీంతో ఈ అంశం నెట్టింట్లో చర్చనీయంగా మారాయి. కొందరు'ఇది కచ్చితంగా కాపీనే'అంటూ తమన్‌పై విమర్శలు చేస్తున్నారు.

ఇక మరికొందరు మాత్రం 'ఇంత పెద్ద విదేశీ డీజే రియాక్ట్ కావడమంటే.. మన పాటకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినట్టే'అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల పాటల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న తమన్‌, ఈసారి ఒరిజినల్ కంపోజర్ నుంచే తీవ్ర ఆరోపణ రావడంతో విషయం మరింత సీరియస్‌గా మారింది. ఈ కాపీ వివాదంపై తమన్ ఎలాంటి స్పందన వస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X