Rajasaab: చివరి 40 నిమిషాలు పూనకాలే! అదో అద్బుత ప్రపంచం.. ‘రాజాసాబ్'పై మారుతి కామెంట్స్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ (The Raja Saab)పై అంచనాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా, మూవీ టీమ్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌తో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మరింత జోరుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌కు కూడా మంచి స్పందన వస్తుండటంతో, ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్‌గా రికార్డు క్రియేట్ చేస్తుందన్న అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి.
యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని కార్తీక్ పలని, సంగీతాన్ని ఎస్. థమన్, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా డైరెక్టర్ మారుతి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని 'రాజా సాబ్' క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్నట్లుగా క్లైమాక్స్ 40 నిమిషాల పాటు ఉంటుందా? అనే ప్రశ్నకు మారుతి క్లారిటీ ఇచ్చారు. 'అంత లాంగ్ క్లైమాక్స్ ఏమీ కాదు. ఒక సాంగ్ తర్వాత క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 35 నుంచి 45 నిమిషాల వరకు క్లైమాక్స్ ఉంటుంది. కానీ అందులో కేవలం ఫైట్స్ మాత్రమే కాదు. స్టోరీ కంటిన్యూ అవుతుంది, ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, ఎలివేషన్స్ ఉంటాయి. ఒకసారి క్లైమాక్స్‌లోకి ఎంటర్ అయితే... ప్రేక్షకులు ఫ్లోలో మరో వరల్డ్‌లోకి వెళ్లిపోతారు. అసలు ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేరు'అంటూ చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను పూర్తిగా కథలోకి ఇన్వాల్వ్ చేయడమే తన లక్ష్యమని, అందుకే క్లైమాక్స్ స్టోరీలైన్‌ను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశానని మారుతి వెల్లడించారు. ఈ కామెంట్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
క్లైమాక్స్‌లోని ఓ ఫైట్ సీన్ గురించి కూడా మారుతి షాకింగ్ వివరాలు వెల్లడించారు. 'ఒక ఫైట్‌లో దాదాపు 70 మంది గాల్లోకి ఎగిరే సీన్ ఉంటుంది. ఒక్కో వ్యక్తిని పైకి లిఫ్ట్ చేయడానికి ముగ్గురు అవసరం. అలా ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 110 మంది పనిచేశారు. అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ షూట్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా మారింది. కొన్ని రోజుల్లో డేకు రెండు లేదా మూడు సీన్స్ మాత్రమే షూట్ చేయగలిగాం అని చెప్పారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని, ప్రభాస్ ఫ్యాన్స్‌కు 'రాజా సాబ్' పూర్తిగా కొత్తగా ఉండబోతుందని మారుతి ధీమా వ్యక్తం చేశారు.
మొత్తంగా చూస్తే, ప్రమోషన్స్‌తో పాటు మారుతి చేసిన ఈ క్లైమాక్స్ కామెంట్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. రొమాన్స్, హారర్, కామెడీ, ఎమోషన్, హై వోల్టేజ్ యాక్షన్ అన్ని ప్యాకేజీగా 'ది రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్నది ఒక్కటే... ప్రభాస్ ఈ సంక్రాంతికి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో అనే వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











