The Raja Saab: బాడీ డబుల్‌పై రాజా సాబ్ హీరోయిన్ క్లారిటీ.. ఆ వీడియోలతో ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిందిగా..
The Raja Saab: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు మారుతి (Maruthi)కాంబోలో తెరకెక్కిన మూవీ 'ది రాజాసాబ్'. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలో నయా రికార్డులు క్రియేట్ చేయబోతుందని డ్లారింగ్ ఫ్యాన్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్, వివాదాలు, విమర్శలను ఎదుర్కొంది. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింతగా ట్రోలింగ్‌కు గురైంది.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రభాస్ హారర్ కామెడీ-సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమా, ఓటీటీలోకి ఏంట్రీ ఇచ్చిన తరువాత మరింత ట్రోలింగ్ ఎదుర్కొంది. ప్రధానంగా సినిమాలో బాడీ డబుల్, ఫేస్ స్వాప్ టెక్నాలజీ వాడకంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చాలా సీన్లలో ప్రభాస్ స్వయంగా నటించలేదని, డూప్‌తో మేనేజ్ చేశారంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) యాక్షన్ సీన్స్ కూడా డూప్‌తోనే చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

హీరో నానమ్మను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌తో మాళవిక ఫైట్ చేసే సీన్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను స్టంట్ ఆర్టిస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. ఆ ఫోటోల్లో హీరోయిన్ స్థానంలో స్టంట్ డబుల్ కనిపించడంతో... 'మాళవిక కూడా యాక్షన్ చేయలేదా?' అంటూ అభిమానులు షాక్ అయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించడంతో ఆ వీడియోను డిలీట్ చేసినా, అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ అయిపోయాయి.ఈ నేపథ్యంలో మాళవిక మోహనన్ స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
హీరోయిన్ మాళవిక తన ఎక్స్ ఖాతాలో 'నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉండేదాన్ని. నా ఛాలెంజ్ అంటే ఇష్టం, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఎంతో ఆనందం ఇస్తాయి' అని ఆమె తెలిపారు. అలాగే... "సినిమా సెట్స్‌లో హీరో లేదా హీరోయిన్ స్టంట్స్ చేస్తున్నా కూడా తప్పనిసరిగా స్టంట్ డబుల్ ఉంటారు. ముందుగా స్టంట్ మాస్టర్లు, డబుల్స్ రిహార్సల్స్ చేస్తారు. ఆ తర్వాతే నటులు ఫైనల్ షాట్ చేస్తారు. కొన్ని రిస్కీ సీన్స్‌లో మాత్రం ప్రొఫెషనల్స్‌కే అవకాశం ఇస్తారు. అది సేఫ్టీ కోసమే" అని క్లియర్‌గా చెప్పారు.
తనపై వచ్చిన అపోహలకు చెక్ పెడుతూ... "నేను చేసిన కొన్ని ఫన్ స్టంట్స్‌కు సంబంధించిన BTS వీడియోలు ఇవిగో... అలాగే నాకు సరైన విధంగా స్టంట్స్ చేయడం నేర్పిన నా స్టంట్ డబుల్‌కు పెద్ద హగ్!" అంటూ వీడియోలను కూడా షేర్ చేశారు. స్టంట్ డబుల్ ఉందని అంటే హీరోయిన్లు యాక్షన్ చేయలేదన్న మాట కాదు. ప్రొఫెషనల్ టీమ్ సపోర్ట్‌తో మాళవిక నిజంగానే చాలానే షాట్స్ స్వయంగా చేసినట్టు స్పష్టమైంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాతో మాళవిక టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఒక్క పోస్టుతో తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా 'ది రాజా సాబ్' విషయంలో బాడీ డబుల్, డూప్ షాట్స్ అంటూ వచ్చిన విమర్శలకు మాళవిక ఇచ్చిన సమాధానం ఇప్పుడు అభిమానులకు ధైర్యం ఇచ్చింది. ప్రొఫెషనల్ టీమ్ సపోర్ట్‌తో తానే చాలానే యాక్షన్ షాట్స్ చేసినట్టు స్పష్టమైంది. ఇదే తరహాలో ప్రభాస్ BTS వీడియోలు కూడా బయటకు రావాలని అభిమానులు కోరుతున్నారు. అలా జరిగితే... ట్రోలింగ్‌కు మరోసారి ఫుల్ స్టాప్ పడటం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











